Begin typing your search above and press return to search.

ఖైదీలకు గుడ్‌ న్యూస్‌ అందించిన కరోనా

By:  Tupaki Desk   |   25 March 2020 8:10 AM GMT
ఖైదీలకు గుడ్‌ న్యూస్‌ అందించిన  కరోనా
X
కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే దాని వలన చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. దేశంలో కాలుష్యం భారీగా తగ్గడంతోపాటు ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్‌ ఖైదీలకు స్వేచ్ఛ కల్పించనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ కట్టడికి తీసుకునే చర్యల్లో భాగంగా పెద్దసంఖ్యలో ఒకచోట ఉండే ఖైదీలను బెయిల్‌ పై విడుదల చేయనున్నారు. వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తుండడంతో జైళ్లలో కూడా ఖైదీలు పెద్దసంఖ్యలో ఒకేచోట ఉండడం కరోనా వైరస్‌ వ్యాప్తికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో జైళ్లలోని విచారణ ఖైదీలను బెయిల్‌ పై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను - కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సోమవారం రాత్రి ఉత్తర్వులు రావడంతో ఖైదీలను కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ పై విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జైళ్లల్లో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నారు.

ఈ మేరకు తమిళనాడులోని అన్ని జైళ్ల నుంచి విచారణ ఖైదీలు విడుదలవుతున్నారు. చెన్నై సెంట్రల్‌ పుళల్‌ జైల్లో స్త్రీ - పురుషులు కలిసి 3 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు - కాంచీపురం - చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి.

– పుళల్‌ జైలు నుంచి 36 మంది మహిళా ఖైదీలతో సహా మొత్తం 262 బెయిల్‌ పై విడుదల కానున్నారు.

– కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో 700 మంది ఖైదీలు - 600 మంది విచారణ ఖైదీలు - చిన్నపాటి నేరాలు చేసిన 131 మంది పురుష ఖైదీలు - 5 మంది మహిళా ఖైదీలు - సేలం సెంట్రల్‌ జైల్‌ లో 800 మందికి పైగా ఖైదీలుండగా - వీరిలో చిన్న నేరాలకు పాల్పడిన వారు 170 మంది - వీరిలో 75 మంది ఖైదీలను ఎంపిక చేసి జాబితాను సేలం జిల్లా కోర్టుకు అప్పగించగా వారిని విడుదల చేయనున్నారు.

– మధురై సెంట్రల్‌ జైల్లో సుమారు 1,500 మంది ఖైదీలు - చిన్నపాటి నేరాలు చేసిన వారు 200 మందికి పైగా ఉన్నారు. వీరిలో తొలిదశలో 200 మందిని మంగళవారం విడుదల చేశారు.

– వేలూరు సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో వేలూరు - తిరుపత్తూరు - రాణీపేట్టై - తిరువన్నామలై జిల్లాల్లోని జైళ్లకు సంబంధించి 126 మందిని విడుదల చేశారు.

– తిరువారూరు జిల్లా మన్నార్‌ కుడిలోని జైల్లో 22 మంది విచారణ ఖైదీలుండగా వీరిలో 14 మందిని సోమవారం విడిచిపెట్టారు. మిగతా 8 మంది ఖైదీలను మంగళవారం రాత్రి విడిచిపెట్టనున్నారు.

– తిరువారూరు మహిళా జైల్లోని 22 మందిలో 11 మందిని - పురుషుల జైల్లోని 18 మందిలో 11 మందిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

– తిరుచ్చిరాపల్లి జైలు నుంచి ఆరుగురిని విడుదల చేశారు.

– పాలయంగోట్టై సెంట్రల్‌ జైలు నుంచి 62 - తెన్‌ కాశీ జైలు నుంచి 52 - తూత్తుకూడి జైలు నుంచి 60 - నాగర్‌ కోవిల్‌ జైలు నుంచి 52 మంది విడుదలయ్యారు.