Begin typing your search above and press return to search.
ప్రయివేటు బిల్లుల సక్సెస్ రేట్ ఇదీ...
By: Tupaki Desk | 22 July 2016 7:00 AM GMTఏపీ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఆమోదం పొంది ఏపీకి ప్రత్యేక హోదా అంశం చట్ట రూపం దాల్చుతుందా....? ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి ఇది కీలక మెట్టు అవుతుందా అంటే అవునని చెప్పడానికి ఆధారాలు కనిపించడం లేదు. అందుకు కారణం గత చరిత్రే... ప్రయివేటు మెంబరు బిల్లుల విషయంలో భారత పార్లమెంటులో గతంలో ఏం జరిగిందన్నది పరిశీలిస్తే ఇలాంటి బిల్లుల సక్సెస్ రేట్ చాలా తక్కువని అర్థమవుతోంది.
* దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో పార్లమెంటు ఆమోదం పొందిన ప్రైవేటు సభ్యుల బిల్లులు కేవలం పధ్నాలుగే.
* వీటిలో సగం 1956లో ఆమోదం పొందినవే.
* అంతే కాదు, 1956లో ఆమోదం పొందిన సుప్రీం కోర్టు( ఎన్ లార్జ్ మెంట్ క్రిమినల్ అప్పిలేట్ జ్యూరిస్ డిక్షన్) బిల్లు 1970లో కానీ చట్టరూపం దాల్చలేదు. అది కూడా ఆ బిల్లును ప్రభుత్వం తనదిగా చేసుకుని చట్టరూపంలోకి తెచ్చింది.
* నిరుడు రాజ్యసభ ఆమోదించిన ట్రాన్స్ జెండర్ బిల్లు ఇప్పటికీ లోక్ సభకు రానే లేదు. కేవలం పెద్దల సభలో మెజారిటీ ఉన్నందువల్లే అక్కడ ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లుది అదే పరిస్థితి అని తెలుస్తోంది. పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నుల వాటా 42శాతానికి పెరగటం ఇందుకు ఒక కారణం. అంతే కాదు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని పర్వతప్రాంత రాష్ట్రాలకు ఇప్పటి వరకు అమలులో ఉన్న ప్రత్యేక హోదా వచ్చే సంవత్సరం నుంచి తొలగిపోతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటం అంటే, అధికార ఎన్ డీఏ ప్రత్యేక దృష్టితో ఆలోచించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప సాధ్యపడదు.
కాబట్టి ఒకవేళ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్ సభకు రావడానికే చాలాకాలం పట్టేస్తుంది.. వచ్చినా గట్టెక్కడం అసాద్యమని గత అనుభవాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపించడానికి మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతందనడంలో ఎలాంటి అనుమానం లేదు.