Begin typing your search above and press return to search.

సామాన్యుల ట్రాన్స్ పోర్ట్ లాఠీ'ఛార్జీ'

By:  Tupaki Desk   |   12 Jan 2016 12:23 PM GMT
సామాన్యుల ట్రాన్స్ పోర్ట్ లాఠీఛార్జీ
X
ప్రతి సంక్రాంతికీ చూస్తున్నదే... ఈసారి మరీ ఎక్కువైంది. సీమాంధ్రుల పై ఛార్జీల లాఠీ ఛార్జీ మొదలైంది. సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే ప్రైవేటు ట్రావెల్స్‌కు పండుగే. సంక్రాంతి పేరుతో ప్రయాణీకులను అడ్డంగా దోచేస్తున్నారు.

పండుగ పూట అయినవారితో గడుపుదామని పల్లె బాట పట్టిన జనాల జేబులు గుల్ల చేస్తున్నారు. విమాన ధరలను మించిపోయేలా బస్సు టిక్కెట్లను పెంచేసి అడ్డంగా దోచుకుంటున్నారు. ఆర్టీసీ కూడా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కు ఏమాత్రం తీసిపోవడం లేదు.

హైదరాబాద్‌ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేవారు కనీసం రూ.3 వేలు టిక్కెట్లకే సమర్పించుకుంటున్నారు. మామూలు రోజుల్లో బస్సులో వెళ్లినా కుటుంబం మొత్తానికి ఇంతే ఖర్చవుతుంది. కానీ, సంక్రాంతి దందాలో ఒక్కరికే 3 వేలు ఖర్చవుతోంది. ఇక రాజమండ్రికి 2వేలు, భీమవరానికి 1600, ఏలూరుకు 2వేలు వసూలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు వెళ్లే రైళ్ల టిక్కెట్లన్నీ నాలుగు నెలల ముందే రిజర్వ్ కావడం... బస్సు త ప్ప వేరే గత్యంతరం లేకపోవడం... స్పెషల్ రైళ్లు కూడా కాకినాడ వరకే వేస్తుండడంతో ఉత్తరాంధ్రులు అన్యాయమైపోతున్నారు.

పండగ పూట ప్రత్యేక రైళ్లు వేస్తున్నా వైజాగ్ వరకు, వైజాగ్ దాటించి శ్రీకాకుళం, ఒరిస్సాలోని ముఖ్యపట్టణాలకు వేయడం లేదు. అదేమని అడిగితే అదంతా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వస్తుందని... తమకు సంబంధం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే వర్గాలు చెప్తున్నాయి. దీంతో ప్రయివేటు ఆపరేటర్లు పండగ సీజన్లో నడిపే డొక్కు బస్సులకే రూ.3 వేలు చెల్లించి సొంతూళ్లకు వెళ్తున్నారు.