Begin typing your search above and press return to search.
ప్రైవేట్ లోనూ వైరస్ పరీక్షలు: ఏపీ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 13 Jun 2020 3:45 AM GMTదేశవ్యాప్తంగా మహమ్మారి వైరస్ సోకిందా లేదా అనే విషయం పరీక్షలు చేసేది ప్రభుత్వ ఆస్పత్రంల్లోనే చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పెద్దసంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. వైరస్ పరీక్షలను ప్రైవేటు ల్యాబులు, ఆస్పత్రుల్లో కూడా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైరస్ టెస్టులను ప్రైవేట్ ల్యాబుల్లోను నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మేరకు పరీక్షల నిర్వహణ సామర్థ్యం వున్నట్లుగా ల్యాబులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాల్సి ఉంటుంది.
ప్రతిపాదనలు తమకు అందించాలని ధ చేయాలని అర్హత గల ప్రైవేట్ ల్యాబులకు ఏపీ సర్కార్ సూచించింది. ఎన్ఏబిఎల్, ఐసీఎంఆర్ గుర్తించిన అనంతరం అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వస్తున్న వారిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం పంపే శాంపిల్స్ సైతం పరీక్షించాలని ప్రైవేటు ల్యాబులను ప్రభుత్వం కోరనుంది. ప్రైవేట్ శాంపిల్స్‌కి ధరను సైతం ఖరారు చేసింది ప్రభుత్వం. ఒక్కో పరీక్షకు కేవలం రూ.2,900 మాత్రమే వసూలు చేసేలా ఉత్తర్వులిచ్చారు.