Begin typing your search above and press return to search.
అతడితో లంచ్ కోసం 23 కోట్లు ఖర్చు చేశాడు
By: Tupaki Desk | 11 Jun 2016 9:41 AM GMTకలలో కూడా ఊహించలేని విషయం ఇది. ఒక ప్రముఖ వ్యక్తితో లంచ్ చేయటానికి ఒక వ్యక్తి చేసిన ఖర్చు ఇది. మరి.. ఆ ప్రముఖుడు అమెరికా అధ్యక్షుడా? లేక హాలీవుడ్ సెలబ్రిటీనా? అంటే కాదు. కాకుంటే ప్రపంచ ప్రఖ్యాత సంపన్నుడు వారెన్ బఫెట్. ఒక చారిటీ కోసం నిదులు సేకరించే నిమిత్తం.. వారెన్ బఫెట్ తనతో లంచ్ చేయటానికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎవరైతే అత్యధిక మొత్తం చెల్లిస్తారో అతనితో వారెన్ బఫెట్ లంచ్ చేస్తారు.
శుక్రవారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో బఫెట్ తో లంచ్ చేసే అవకాశాన్ని చైనాలోని బీజింగ్ కు చెందిన దలియాన్ జేయూన్ ఎంటర్ టైన్ మెంట్ కో సొంతం చేసుకుంది. బఫెట్ తో లంచ్ కోసం జరిపిన వేలం పాటలో 3456789 డాలర్లకు లంచ్ స్లాట్ ను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని మన రూపాయిల్లో చూస్తే దాదాపు రూ.23.14 కోట్లుగా ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అంకెల్ని చూస్తే.. వరుస సంఖ్యలో ఉండటం విశేషం.
తనతో లంచ్ చేసే అవకాశం కోసం వేలం పాట నిర్వహించే బఫెట్.. అలా వచ్చిన మొత్తాన్ని గ్లైడ్ ఫౌండేషన్ కింద నిరాశ్రయులైన పేదల వసతి కోసం.. భోజనం.. విద్యా.. వైద్య.. ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేస్తుంటారు.