Begin typing your search above and press return to search.
చుక్కలు కనిపించినా లైట్ తీసుకున్నారు
By: Tupaki Desk | 18 Jan 2016 6:36 AM GMTసంక్రాంతి పండగ ఏమో కానీ.. ప్రయాణం ఇంత ఖరీదా? అన్న అభిప్రాయం కలిగేలా చేసింది. పండగ డిమాండ్ తో పాటు.. ఊరికి వెళ్లొద్దామని ఆఖరినిమిషంలో అనుకున్న వారికి చుక్కలు కనిపించేలా చేసింది. బస్సు టిక్కెట్ల ధరలు గూబ గుయ్యమనేలా చేస్తే.. విమాన ఛార్జీల ధరలకైతే ఏకంగా రెక్కలు వచ్చిన పరిస్థితి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు బస్సు టిక్కెట్టు రూ.3వేల వరకూ పలికితే.. విమాన ఛార్జీ రూ.17వేల నుంచి రూ.50వేల మధ్య పలకటం గమనార్హం.
విడిరోజుల్లో ఇదే ప్రయాణానికి బస్సు చార్జీ రూ.వెయ్యి లోపు.. విమాన ఛార్జీ అయితే రూ.2500 మాత్రమే ఉండే పరిస్థితి. విశాఖ.. హైదరాబాద్ సర్వీసు ఒక్క విషయంలోనే కాదు.. ప్రతి రూట్లోనూ ఇదే పరిస్థితి. ప్రైవేటు బస్సుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగితే.. విమానఛార్జీలు సైతం సెన్సెక్స్ మాదిరి గంట గంటకు పెరిగిపోయాయి. విశాఖ నుంచి ఢిల్లీకి విడి రోజుల్లో రూ.10వేల లోపు ఛార్జీ ఉంటే.. సంక్రాంతి పుణ్యమా అని ఒక దశలో టిక్కెట్టు ధర రూ.70వేలకు కాస్త అటూఇటూగా పలకటం గమనార్హం. అయితే.. ధరలు ఇంత భారీగా ఉన్నా.. అవసరాల పుణ్యమా అని ఎవరికి వారు టిక్కెట్లు కొనుగోలు చేయటం కనిపించటం. పండక్కి వూరికి వెళ్లి రావటం ‘ఖర్చు’తో కూడుకున్న వ్యవహారంగా మారిందని చెప్పొచ్చు.