Begin typing your search above and press return to search.

శంషాబాద్ విమానాశ్రయం కూడా ప్రైవేటుకేనా

By:  Tupaki Desk   |   15 March 2021 5:30 AM GMT
శంషాబాద్ విమానాశ్రయం కూడా ప్రైవేటుకేనా
X
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తొందరలోనే ప్రైవేటుపరమైపోతోంది. పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వ రంగ సంస్ధల నుండి తన పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిసైడ్ అయ్యింది. పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా ఆర్ధిక సంవత్సరంలో రూ. 2.5 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.

తన టార్గెట్ ను రీచ్ అవటంలో భాగంగా వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించేయాలని డిసైడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంగానే వైజాగ్ లో గడచిన నెలన్నరగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇపుడు కేంద్రం దృష్టి శంషాబాద్ విమానాశ్రయం మీదపడింది. ఈ విమానాశ్రయంలో కేంద్రానికి 74 శాతం వాటాలున్నాయి.

మిగిలిన 26 శాతం వాటాలను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్ధ (ఏఏఐ), రాష్ట్రప్రభుత్వానికి ఉంది. తన వంతుగా ఉన్న 74 శాతం వాటాని కేంద్రం అమ్మేయాలని డిసైడ్ అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ విమానాశ్రయం ప్రైవేటుపరమైపోయింది. ఈ విమానాశ్రయంలోని సేవలన్నీ ప్రైవేటు సంస్ధల ద్వారానే అందుతున్నాయి. అయితే తన వాటాను అమ్మేయటం ద్వారా కేంద్రం చేతులు దులిపేసుకోవాలని అనుకున్నది.

తొందరలోనే ముంబాయ్, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తన వాటాను కేంద్రం ఉపసంహరించుకోబోతోంది. ప్రస్తుతానికి ఏఏఐ చేతిలో 100 విమానాశ్రయాలున్నాయి. వీటిన్నింటినీలో ఉన్న వాటాలను ఉపసంహరించుకోబోతోంది. ముంబాయ్ విమానశ్రయాన్ని అదానీ గ్రూపు, బెంగుళూరు విమనాశ్రయంలో వాటాను జీఎంఆర్ గ్రూపు సొంతం చేసుకుంది. మరి శంషాబాద్ విమానాశ్రయం వాటాను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.