Begin typing your search above and press return to search.
బండి కేసులో ప్రివిలేజ్ కమిటీ నోటీసులు.. అధికారులకు తప్పని తిప్పలు
By: Tupaki Desk | 22 Jan 2022 11:30 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాగరణ దీక్ష నుంచి పోలీసులు అరెస్టు చేయడం.. ఆ వెంటనే జైలుకు పంపించడం గుర్తింది కదా.. ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ ఘాటుగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. బండి సంజయ్ ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది.
ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్ కేసులో వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ స్పష్టం చేసింది. డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌కు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. వీర కూడా కమిటీ ముందు అదే రోజు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ విషయం చాలా సీరియస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన ఘటన వివరాలు తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా.. పోలీసులు తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారని.. పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని తెలిపారు.
గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్ధలు కొట్టారని ప్రివిలేజ్ కమిటీకి వివరించారు. ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది. అసలు ఎంపీ అయిన ఒక నేతను స్పీకర్ అనుమతి తీసుకోకుండా.. అరెస్టు ఎలా చేస్తారనేది ప్రధానంగా కమిటీ ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దీనివెనుక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని..అయినప్పటికీ.. ఎంపీపై చర్యలు తీసుకునే విధానంగా సంబంధిత నిబంధనలు పాటించాలి కదా! అనేది ప్రవిలేజ్ కమిటీ ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.