Begin typing your search above and press return to search.
ప్రియా మాలిక ఘనత.. రెజ్లింగ్ లో భారత్ కు తొలి స్వర్ణం
By: Tupaki Desk | 25 July 2021 8:43 AM GMTరెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి అంతర్జాతీయ క్రీడారంగంలో భారత పతాకాన్ని రెపరెపలాడించింది.
హంగేరి రాజధాని బూడాపెస్ట్ లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో 73 కేజీల విభాగంలో ఫైనల్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ ను ప్రియా మాలిక్ సొంతం చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ లో మీరాభాయ్ రజతం గెలిచిన మరుసటి రోజే.. ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గడం భారత క్రీడాభిమానులకు సంతోషంలో ముంచెత్తించింది.
ప్రపంచవేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటడం విశేషంగా మారింది. ట్యోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత రెజర్లపై కూడా భారీ అంచనాలున్నాయి. 57 కేజీల విభాగంలో రవికుమార్, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా, పురుషుల జాబితాలో పోటీపడుతున్నారు. ఇక మహిళల్లో సీమా, వినేష్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు. ఇక్కడ కూడా పతకం రావాలని కోరుకుంటున్నారు.