Begin typing your search above and press return to search.

హీరోయిన్ల జీవితాలు ఎంత దారుణమో చెప్పిన సీనియర్ నటి

By:  Tupaki Desk   |   7 April 2020 11:30 PM GMT
హీరోయిన్ల జీవితాలు ఎంత దారుణమో చెప్పిన సీనియర్ నటి
X
సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం వైదొలిగి టీవీ ప్రోగ్రాంలు చేసుకుంటున్న నటి ప్రియమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ప్రియమణి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఓ వర్గానికి చెందిన హీరోయిన్స్ జీవితాలు మరీ దారుణంగా ఉన్నాయని వాపోయింది. సమంత - నయన తార - అనుష్క లాంటి వాళ్లకు మాత్రమే రెమ్యునరేషన్ భారీగా ఇస్తున్నారని.. టాలెంట్ ఉన్న మిగతా హీరోయిన్స్ కు మాత్రం ఆ రేంజ్ లో గౌరవం దక్కడం లేదని హాట్ కామెంట్ చేసింది. హీరోయిన్ల కష్టానికి ఏమాత్రం గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

నిర్మాతలు రెమ్యూనరేషన్స్ కూడా కొంత ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ప్రియమణి కడిగిపారేసింది. కొంతమంది మధ్యతరగతి హీరోయిన్స్ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని తెలిపింది.

విజయాలు సాధించినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ కు కనీస పారితోషికం కూడా ఇవ్వడం లేదని ప్రియమణి ఆరోపించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి అంతిమంగా శిక్ష పడడం లేదని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది.