Begin typing your search above and press return to search.
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య.. కొత్త వివాదం!
By: Tupaki Desk | 30 Dec 2019 6:28 AM GMTమహారాష్ట్రంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోయిన అనంతర పరిణామాలు రాజకీయంగా ఆసక్తిదాయకంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీ-శివసేన కూటమిగా ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారాన్ని సంపాదించుకున్నా, బీజేపీతో శివసేన విబేధించి బయటకు వెళ్లింది. ఇరు పార్టీలూ సీఎం సీటును లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేశాయి. ఆ పోరులో శివసేన వెళ్లి కాంగ్రెస్ - ఎన్సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక రెండో సారీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా.. కొన్ని గంటల్లోనే ప్రభుత్వం కూలిపోవడంతో ఫడ్నవీస్ కు అవమానం మిగిలింది. ఆ సంగతలా ఉంటే.. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య విషయంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలవుతూ ఉంది. ఆమె యాక్సిస్ బ్యాంక్ లో సీనియర్ ఎక్సిక్యూటివ్ గా వ్యవహరించింది. ఆ సమయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ ఖాతాలను ఆ బ్యాంక్ లోకి మార్పించారనే ఆరోపణలు వస్తున్నాయి.
వేరే బ్యాంకుల్లోని ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలను క్లోజ్ చేయించి - యాక్సిస్ బ్యాంక్ లో శాలరీ ఖాతాలను తెరిపించారని.. ఇదంతా అమృత వల్లనే జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రస్తావించారు.
దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో.. ప్రభుత్వం ఒక యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి ఆదేశానుసారం నడుచుకుంది.. అంటూ ఆమె ఆరోపించారు. అధికారం నుంచి దిగిపోయాకా నేతలను ఇలాంటి వివాదాలు వెంటాడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫడ్నవీస్ వంతు వచ్చినట్టుగా ఉంది.