Begin typing your search above and press return to search.
కూతుర్ని రేప్ చేస్తామంటూ.. నేతకు వార్నింగ్
By: Tupaki Desk | 2 July 2018 4:06 PM GMTముస్లిం దంపతులను అవమానించిన లక్నో పాస్ పోర్టు అధికారి వికాస్ మిశ్రాను గోరఖ్ పూర్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యం ఓ వైపు కలకలం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ నెటిజన్ ``ముస్లింలను బుజ్జగించొద్దని మీ ఆవిడకు బుద్ధి చెప్పండి`` అంటూ స్వరాజ్ కౌశల్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ పరిణామం ఓ వైపు కలకలం రేకెత్తిస్తుండగానే...మరో మహిళా నేతకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఇలా బెదిరింపులకు గురైన వారి జాబితాలో చేరారు.
‘ప్రియాంక గారూ.. మీ కూతుర్ని రేప్ చేస్తాను. ఆమెను నా దగ్గరకు పంపండి’ అంటూ ఫొటోతో పాటు ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ను చూసిన అనంతరం ప్రియాంక షాక్ కు గురయ్యారు. . ”ఒక దేవుడి బొమ్మ పెట్టుకుని సోషల్ మీడియాలో చెలామణీ అవుతున్నావు. నిన్ను ఆ రాముడే తగిన విధంగా శిక్షిస్తాడు” అంటూ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా గోరెగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శ్రీరాముడి ప్రొఫైల్ పిక్ ను పెట్టుకున్న సదరు ట్విటర్ యూజర్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడంలో వెనుకాడలేదని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఆమెకు పలువురు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన ఎన్ సీపీ పార్టీ నాయకురాలు - ఎంపీ సుప్రియా సూలే చతుర్వేది కుమార్తెకు ఈ తరహా హెచ్చరికలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై చట్టప్రకారం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని - సమాజంలో చెడు ఉన్నట్టే మంచి కూడా ఉందని అన్నారు.