Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు రాజీనామా.. ఆమెకు శివసేన పెద్ద పీట!
By: Tupaki Desk | 20 April 2019 5:17 PM GMTకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేదికి చేరీ చేరగానే మంచి ఆఫర్లు లభిస్తున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఆమెకు శివసేన ఏకంగా రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఖరారు కావడం లేదని, ఆమెను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని శివసేన భావిస్తోందట. వాస్తవానికి ప్రియాంక చతుర్వేది ముంబై నార్త్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఆ మేరకు ప్రయత్నాలు సాగించారట. అయితే ఆమెకు అక్కడ టికెట్ లభించలేదు.
టికెట్ దక్కలేదనే ఆమె రాజీనామా చేశారనే ప్రచారమూ ఉంది. అయితే ఆమె మాత్రం తనను కాంగ్రెస్ లో లైంగిక వేధింపులకు గురి చేశారని, తను కొంతమందిపై కంప్లైంట్ చేసినా వారిపై చర్యలు తీసుకోలేదని అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు.
ఆమె రాజీనామా చేసినందుకు రీజన్ ఏదైనప్పటికీ.. ఆమె రాజీనామా మాత్రం కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతూ ఉంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి రాజీనామాలు ఇరకాటంలో పెడతాయి ఏ పార్టీకి అయిన. అందులోనూ ప్రియాంక చతుర్వేది చక్కగా మాట్లాడగల వక్త. సోషల్ మీడియా యువతరాన్ని ఆకట్టుకుంటున్న నేత. ఆమె రాజీనామా కాంగ్రెస్ కు ఇబ్బందికరమైన అంశమే. అందుకు తగ్గట్టుగా శివసేన కూడా ఆమెకు పెద్ద పీట వేస్తున్నట్టుగా ఉంది!