Begin typing your search above and press return to search.
అయ్యగారి ఆశీస్సులుంటే చాలు.. స్టార్లే
By: Tupaki Desk | 31 Dec 2015 5:10 AM GMTగొప్పలు చెప్పుకోవటం మామూలే. కానీ.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తమ గొప్పలు తాము చెప్పుకోవటానికి కాస్త మొహమాటపడతారు. తటపటాయిస్తారు. కానీ.. సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు అలాంటివేమీ పెద్దగా పెట్టవు. తన గురించి.. తన గొప్పతనం గురించి వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేస్తుంటారు. తానెంత మొనగాడినన్న విషయాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నంలో ఎదుటివారిని తక్కువ చేసి చూపించేందుకు సైతం వెనుకాడరు.
తాజాగా ములాయిం సింగ్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రియాంకా చోప్రాను ఆమె తండ్రిని కలిశానని.. అప్పడు పెద్ద హీరోయిన్ కావాలని తాను ఆశీర్వదించానని.. తాను అందించిన ఆశీస్సులతో ఆమె ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఒక్క ప్రియాంకనే కాదు.. తన ఆశీర్వాదం వల్లనే.. మాధురీ దీక్షిత్.. అమితాబ్ బచ్చన్.. సైఫ్ ఆలీఖాన్ ఇలాంటి చాలామందిని స్టార్లుగా చేశానని వ్యాఖ్యానించారు.
మరి.. ఇంతమందిని స్టార్లు చేసిన ములాయం.. తన కొడుకు అఖిలేష్ ను కూడా స్టార్ట్ హీరోగా చేసి.. రాజకీయాల్లోకి తీసుకొస్తే మరింత బాగుండేది కదా. బాలీవుడ్ సంచలన హీరోగా చేసేసి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీసుకొస్తే.. ఒక్క యూపీ ఏంటి? దేశం మొత్తం అఖిలేశ్ కు నీరాజనాలు పట్టేదేమో? ములాయంకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో మరి..?