Begin typing your search above and press return to search.

దూబే అరెస్ట్ పై సీబీఐ ఎంక్వైరీకి ప్రియాంక డిమాండ్ !

By:  Tupaki Desk   |   9 July 2020 1:00 PM GMT
దూబే అరెస్ట్ పై సీబీఐ ఎంక్వైరీకి ప్రియాంక డిమాండ్ !
X
8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న యూపీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన తర్వాత.. వికాస్ దుబే అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచీ తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకి నేడు పోలీసులు పట్టుకున్నారు.

అయితే , ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ కాన్పూర్ ఎన్ కౌంటర్ తరువాత దాదాపు 700 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ఏ ఆటంకం లేకుండా ఎలా ప్రయాణించాడు అని , ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని , అలాగే ప్రభుత్వం తో అతడి సంబంధాలని ఇది సూచిస్తుంది అని ఈ అరెస్ట్ పై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. దూబే కి , ఉన్నత స్థాయి అధికారులు, లేదా పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి రావాలి అంటే సీబీఐ దర్యాప్తు అవసరమని ప్రియాంక ట్వీట్ చేశారు.

వికాస్ దూబే గురించి పోలీసులని అలెర్ట్ చేసినప్పటికీ అతడు ఉజ్జయిని చేరుకోగలిగాడంటే.. ఈ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందొ అర్థమవుతోందని ఆమె అన్నారు. దూబే అరెస్టు…ముందుగా వేసుకున్న లొంగుబాటు అని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఉజ్జయినిలోని ఆలయానికి వెళ్లిన దూబే అక్కడి సెక్యూరిటీ గార్డులకు తాను ఎవరో చెప్పాడని, తన గురించి పోలీసులకు తెలియజేయాలని కోరాడని కూడా ఆరోపణలు చేస్తున్నారు.