Begin typing your search above and press return to search.

'మోడీ 56 అంగుళాల ఛాతీ' వ్యాఖ్య‌పై ప్రియాంక గుస్సా!

By:  Tupaki Desk   |   17 May 2019 5:43 AM GMT
మోడీ 56 అంగుళాల ఛాతీ వ్యాఖ్య‌పై ప్రియాంక గుస్సా!
X
త‌న వీర‌త్వానికి.. ధీర‌త్వానికి నిద‌ర్శ‌నంగా మోడీ చెప్పుకునే గొప్ప‌ల గురించి తెలిసిందే. ఇక‌.. ఆయ‌న ప‌రివారం సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మోడీ 56 అంగుళాల ఛాతీ అంటూ చెప్పిన మాట‌లు.. చేసిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. గ‌డిచిన ఐదేళ్ల‌లో మోడీ 56 అంగుళాల ఛాతీ మొన‌గాడిత‌నాన్ని ఈ దేశం చాలానే చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా 'మోడీ 56 అంగుళాల ఛాతీ' వ్యాఖ్య‌పై కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా రియాక్ట్ అయ్యారు. మోడీ గొప్ప‌త‌నాన్ని కీర్తించే వారికి మంట పుట్టేలా ఆమె వ్యాఖ్య‌లు ఉన్నాయి. అస‌లు ఆయ‌న‌కు గుండె ఎక్క‌డ ఉందని క్వ‌శ్చ‌న్ వేశారు. తాజాగా ఒక ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడిన ఆమె.. మీరు మీ 56 అంగుళాల ఛాతీ గురించి గొప్ప‌గా చెప్పుకుంటారు.. కానీ మీ హృద‌యం ఎక్క‌డుంది? అని ఘాటు విమ‌ర్శ చేశారు.

ప్ర‌ధాని జాతీయ‌వాదం గురించి మాట్లాడేట‌ప్పుడు పాకిస్థాన్ ను ప్ర‌స్తావిస్తార‌ని.. జాతీయ‌వాదం అంటే పాక్ కు కౌంట‌ర్ ఇవ్వ‌ట‌మేనా? ఉద్యోగ క‌ల్ప‌న‌.. రైతులు లాంటి అంశాలుజాతీయ‌వాదం కాదా మోడీ? అంటూ ఆమె ఇచ్చిన పంచ్ ఆలోచించేలా ఉండ‌ట‌మే కాదు.. మోడీ గొప్ప‌ల‌కు స‌రైన స‌మాధానం ఇచ్చిన‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.