Begin typing your search above and press return to search.
ప్రియాంక పట్ల యూపీ పోలీసులు అలా చేశారా?
By: Tupaki Desk | 29 Dec 2019 5:07 AM GMTకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఆమె జీవితంలో.. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అధినాయకత్వానికి చెందిన మరే నేతకు.. గాంధీ ఫ్యామిలీకి ఇప్పటివరకూ ఎదురుకాని దారుణమైన అనుభవం ప్రియాంకకు ఎదురైనట్లు చెబుతున్నారు. యూపీలో ఆమె ఆకస్మిక పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న హైడ్రామా ఇప్పుడో వివాదంగా మారింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి.. అరెస్టు అయిన మాజీ ఐపీఎస్ అధికారి దారాపురీ ఫ్యామిలీని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ లక్నోకు వచ్చారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆమె దారాపురీ ఇంటికి బయలుదేరారు. ఆ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న కారులో ఆమెతో పాటు ముగ్గురున్నారు. ఆమె ప్రయాణిస్తున్న బుల్లెట్ ఫ్రూవ్ వాహనాన్ని ఇందిరానగర్ లోని దారాపురి ఇంటికి కాస్త దూరంలోని లోహియా క్రాసింగ్ వద్ద నిలిపేశారు పోలీసులు.
తనను ఎందుకు ఆపారంటూ ప్రియాంక వారిని ప్రశ్నించారు. ఆమె పర్యటన కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న పోలీసులు..ఆమెను ముందుకు వెళ్లటానికి ఒప్పుకోలేదు. తాను పరామర్శకు వెళుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదని.. సానుభూతి ప్రకటించేందుకు వెళుతున్నప్పుడు శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. వాహనం దిగి కాలినడక ముందుకెళ్లారు.
దీంతో స్పందించిన పోలీసులు ఆమెను ముందుకు వెళ్లనీయలేదు. ఆమె చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా చిన్న తోపులాట చోటు చేసుకుంది. దీనిపై ప్రియాంక ఆవేశం.. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూపీ మహిళా పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు.
ఒక మహిళా కానిస్టేబుల్ తనను మెడపట్టి తోసేసిందని.. మరొకరు గొంతు పట్టుకొని పక్కకు లాగటంతో తాను కింద పడిపోయినట్లుగా ప్రియాంక మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించిన ఆమె.. శాంతియుతంగా ఆందోళన చేసిన 76 ఏళ్ల దారాపురీని అరెస్టు చేసి జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరామర్శను అడ్డుకోవటం అమానుషత్వమని.. తన హక్కులు తనకున్నాయని మండిపడ్డారు.

అంతలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు స్కూటర్ తీసుకొనిరావటంతోఆమె దానిపై ఎక్కి దారాపురీ ఇంటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. రెండు కిలోమీటర్ల వరకూ ప్రయాణించిన తర్వాత ప్రియాంకను మరోసారి పోలీసులు నిలిపివేశారు.
అయినప్పటికీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమె తన ప్రయత్నాన్ని వీడలేదు. పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకొని మరీ ముందుకెళ్లిన ఆమె.. ఎట్టకేలకు దారాపురీ ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శించి బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తనను అరెస్టు చేయాలనుకుంటే చేయాలే కానీ ఇలా తన మీద చేయ్యి చేసుకోవటం తప్పంటూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు.