Begin typing your search above and press return to search.

15 రోజుల్లో 100 మంది హత్య .. ప్రియాంక సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   28 April 2020 8:50 AM GMT
15 రోజుల్లో 100 మంది హత్య .. ప్రియాంక సంచలన వ్యాఖ్యలు !
X
దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా కరోనా భాదితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో పూర్తిగా నిమగ్నమైంది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ సర్కార్‌ పై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో 100 మంది హత్య గురయ్యారని అన్నారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ పోస్ట్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో గత 15 రోజుల్లో వంద మంది హత్య చేయబడ్డారు. మూడు రోజుల క్రితం పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృత దేహాలను ఎటాలో అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు కనుగొన్నారు. వారికి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. దీనికి ఎవరి హస్తం ఉందో కూడా తెలీదు అని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని ప్రియాంక డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్‌ నేతలు సైతం వీటిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. మరో వైపు ఈ హత్యల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించ లేదు.

ఇకపోతే, రాష్ట్రంలో నకిలీ పీపీఈ కిట్ల స్కామ్‌ వ్యవహారంలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని సోమవారం యోగీ ఆదిత్యనాధ్‌ సర్కార్ ‌ను నిలదీశారు. కరోనా యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లని, వారికి నకిలీ కిట్లను సరఫరా చేస్తూ వైద్యుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. వైద్యుల భద్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు .