Begin typing your search above and press return to search.

బయటకు రాకున్నా ప్రియాంక అన్ని చేశారట

By:  Tupaki Desk   |   9 March 2017 6:38 AM GMT
బయటకు రాకున్నా ప్రియాంక అన్ని చేశారట
X
జరగటానికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. అటు రాజకీయ పార్టీల దృష్టి.. ఇటు మీడియా ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్ ఫలితం మీదనే అన్న విషయం తెలిసిందే. ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. మరో రెండు రోజుల వ్యవధిలో (శనివారం) ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దీంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని వారాలుగా తీవ్ర ఉత్కంటతో గడిపిన రాజకీయ నేతలు..పార్టీలు ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారు. అదే సమయంలో పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ.. తమకున్న విజయవకాశాలు ఎంతలా ఉండనున్నాయి? అన్న అంశంపై కసరత్తు సాగుతోంది. ఇలాంటి వేళ.. తమ కూటమికి పవర్ పక్కా అని ఫీలవుతున్న పార్టీగా ఎస్పీ ప్లస్ కాంగ్రెస్ గా చెబుతున్నారు.

మరోవైపు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. అఖిలేశ్ సర్కారు తీరుతో విసిగిపోయినట్లుగా కమలనాథులు అంచనాలు వేస్తున్నారు. ఇలా ఎవరి వారు తమ తమ లెక్కల్ని వేసుకుంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్న వేళ.. కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహితంగా వ్యవహరించే కశ్మీర్ నాయకుడు గులాంనబీ అజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కీలకమైన యూపీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కీ రోల్ ప్లే చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే యూపీ అధికారపక్షమైన ఎస్పీకి కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదిరచే విషయంలో ప్రియాంక ప్లే చేసిన రోల్ ను ఎవరూ మరచిపోలేరు. కేవలం పార్టీల మధ్య పొత్తులకే పరిమితం కాకుండా ప్రచారం కూడా చేస్తారన్న అభిప్రాయాన్ని వ్య్తక్తమైంది. అయితే.. ఆమె మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ కుటుంబ నియోజకవర్గాలైన అమేధి.. రాయబరేలీ మీదనే ఫోకస్ చేసి.. ప్రచారాన్ని జరిపారు. ఈ తీరు పలువురు కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైనా.. ఆమె పట్టించుకోలేదు.

పొత్తులకే పరిమితం అయ్యారన్న విమర్శను కొట్టి పారేస్తున్నారు గులాం నబీ. ఎందుకంటే.. సమాజ్ వాదీతో కాంగ్రెస్ పొత్తును ఫిక్స్ అయ్యేలా చేయటమే కాదు.. బ్యాక్ ఎండ్ లో ఆమె చాలా విషయాల మీద ఫోకస్ చేసినట్లుగా వెల్లడించారు. పోల్ మేనేజ్ మెంట్ ఇష్యూల్లో ప్రియాంక చాలా కీ రోల్ ప్లే చేశారని.. బయటకు రానంత మాత్రాన ఆమె ఎన్నికల విషయాల్లో దూరంగా ఉన్నారని అనుకోవటం తప్పని ఆయన చెబుతున్నారు. మరి.. బ్యాక్ గ్రౌండ్ లో ఉండి వ్యూహాల్ని రచించి.. అమలు చేసిన ప్రియాంక ఎంత మేర సక్సెస్ అయ్యిందన్నది తేలాలంటే మరో రెండురులు వెయిట్ చేయక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/