Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో ఆమె శకం మొదలైనట్లేనా?
By: Tupaki Desk | 23 Jan 2017 4:11 PM GMTకాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పరిణామానికి సంబంధించిన మొదటి అడుగు అనుకోకుండా పడిపోయిందా? అంటే అవుననే చెబుతున్నారు. సోనియమ్మ తర్వాత.. కాంగ్రెస్ పగ్గాలు ఎవరు చేపట్టాలన్న విషయంపై చాలాకాలంగా పెద్ద చర్చే సాగుతోంది. ప్రియాంక సీన్లో లేకపోవటంతో.. రాహుల్ మినహా మరో దిక్కులేని పరిస్థితి. అయితే.. ఏదోలా ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేసినోళ్లు చాలామందే ఉన్నారు.
అయినప్పటికీ.. ప్రియాంక మాత్రం కాంగ్రెస్ పాలిటిక్స్ ను నేరుగా పర్యవేక్షించేందుకు ససేమిరా అనేవారు. మరోవైపు.. కోటి ఆశలు పెట్టుకున్న యువరాజు రాహుల్ తో ఏమీ కాదన్న వాదన ఈ మధ్యన పార్టీలో ఎక్కువైంది. ఇందుకు తగ్గట్లే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ ప్రయత్నించి.. ఫెయిల్ అయిన చోట ప్రియాంక ఎంట్రీతోనే ఘన విజయం సాధించటం ఇప్పుడా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
యూపీ అధికారపక్షం సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. కొత్త సంవత్సరం తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్ వచ్చాక.. రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతాయని ఆశించారు. కాస్త ఆలస్యంగా విదేశాల నుంచివచ్చిన రాహుల్.. వచ్చీ రాగానే ఎస్పీతో చర్చలుజరిపినా.. ఆయన కోరినట్లుగా వంద సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ నో అంటే నో అనేసిన పరిస్థితి.
ఒకదశలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి వేళ.. అనూహ్యంగా రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. అఖిలేశ్ సతీమణి డింపుల్ సాయంతో పొత్తు లెక్కలు తేల్చేయటమే కాదు.. తాము మొదట్నించి అడుగున్న వంద స్థానే.. 105 సీట్లకు ఓకే చెప్పించుకోవటం విశేషం. అచ్చం ఇందిరమ్మ పోలికలు పొణికి పుచ్చుకున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ప్రియాంక.. తన తొలి అడుగులోనే అద్భుత విజయం సాధించారని.. ఆమె కానీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించి.. బరిలోకిదిగితేకాంగ్రెస్ లో కొత్త సమరోత్సాహం నిండటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. యూపీ పొత్త ఎపిసోడ్ లో రాహుల్ అడ్డంగా ఫెయిల్ అయినట్లేనన్నవిషయాన్ని కాంగ్రెస్ నేతలు కన్ఫర్మ్ చేయటమే కాదు.. ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు స్వీకరిస్తే బాగుందన్న భావనను వ్యక్తం చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి..పార్టీ నేతల కలల్ని ప్రియాంక తీరుస్తారా? అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/