Begin typing your search above and press return to search.
పిన్నిని ఓడించడంపై ప్రియాంక ప్రత్యేక దృష్టి?
By: Tupaki Desk | 7 April 2019 9:27 AM GMTరాహుల్ గాంధీకి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హతలు ఏవీ లేవని వ్యాఖ్యానించిన మేనకగాంధీపై కాంగ్రెస్ వాళ్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. ప్రియాంకగాంధీ కాంగ్రెస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా ప్రయోజనం లేదని వ్యాఖ్యానించిన మేనకను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక కసరత్తు చేస్తూ ఉందని సమాచారం.
ఈ సారి ఎలాగైనా మేనకాగాంధీని ఎన్నికల్లో ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సారి తమకు మంచి అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారట. దానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.
మామూలుగా మేనకగాంధీ యూపీలోని ఫిలిబిత్ సీటు నుంచి పోటీ చేసే వాళ్లు. అక్కడ నుంచి ఆమె వరస విజయాలను సాధించారు. అయితే తనయుడు వరుణ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాకా అతడి కోసం ఆ సీటును త్యాగం చేసింది. ఫిలిబిత్ నుంచి వరుణ్ కు అవకాశం ఇచ్చింది. తను సుల్తాన్ పూర్ కు వలస వెళ్లిందామె. అక్కడ నుంచి కూడా ఒకసారి నెగ్గింది. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ.. గత ఎన్నికల్లో ఈ తల్లీకొడుకులు సీట్లు మార్చుకున్నారు.
ఫిలిబిత్ నుంచి మేనక, సుల్తాన్ పూర్ నుంచి వరుణ్ గాంధీ పోటీ చేశారు. ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు యూపీలో బీజేపీకి గత ఎన్నికల్లా అత్యంత అనుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేఫథ్యంలో తమకు సేఫ్ సీటు అయిన ఫిలిబిత్ నుంచి వరుణ్ గాంధీని పోటీచేయించాలని మేనక అనుకుంటోంది. తను సుల్తాన్ పూర్ నుంచి రంగంలోకి దిగబోతోంది.
ఇలా తనయుడుని సేఫ్ సీటు నుంచి పోటీ చేయించి, కష్టమైన సుల్తాన్ పూర్ నుంచి తను పోటీ చేయడానికి మేనక రెడీ అయ్యింది.ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ పూర్లో మేనకను ఓడించడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. పదేళ్ల కిందట ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. ఈ సారి అన్ని శక్తులనూ ఉపయోగించి మేనకను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని సమాచారం. ఎన్నికల్లో యూపీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రియాంక కూడా ఈ విషయంపై పార్టీ క్యాడర్ కు ప్రత్యేక ఆదేశాలిచ్చారని ప్రచారం జరుగుతోంది.