Begin typing your search above and press return to search.
ఇది పిరికి ప్రభుత్వం..నిప్పులు చెరిగిన ప్రియాంక!
By: Tupaki Desk | 16 Dec 2019 11:07 AM GMTబీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి సంపూర్ణ మెజారిటీ తో అధికారంలోకి రావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ సర్కార్ పౌరసత్వ సవరణ బిల్లుకి పార్లమెంట్ లో ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ బిల్లుకి రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలపడంతో ..ఈ పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా మారింది. దీనితో దేశ వ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఢిల్లీలో విద్యార్థుల కదం తొక్కుతున్నారు. జేఎంఐ విద్యార్థులకు మద్దతుగా దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు నిరసనలకు దిగారు. అలీగడ్ - నద్వా యూనివర్సిటీలు రణరంగంగా మారాయి. విద్యార్థుల ఆందోళనలు హింసకు దారి తీశాయి. బస్సులు - ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఆందోళనలను నిలువరించేందుకు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ. ఖాకీలు యూనివర్సిటీ ల్లోకి ప్రవేశించి విద్యార్థులను తీవ్రంగా హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. జర్నలిస్టులు - పౌరులు - విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. యువతను అణగదొక్కాలని చూస్తోందని..ఇది పిరికి ప్రభుత్వమంటూ ట్వీట్ చేశారు. కానీ భారత యువత..ఇలాంటి బెదిరింపులకు భయపడరు. ప్రధాని విద్యార్థుల మాట వినాల్సిందేనని అంటూ తెలిపారు.