Begin typing your search above and press return to search.
ప్రియాంకను రంగంలోకి దింపుతున్నారా?
By: Tupaki Desk | 1 March 2016 6:54 PM GMTవరుస ఓటములతో తెగ ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ తన అమ్ములపొదిలోని ఒక బలమైన ఆయుధాన్ని తీసి.. తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై ఎక్కు పెట్టేందుకు సిద్దమవుతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించటం.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో అధికారం చేపడితే 2019 నాటి ఎన్నికలకు కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు సాయపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకోసం.. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంకను బరిలోకి దించేందుకు రెఢీ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. అనంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఊసు లేకుండా పోయిన నేపథ్యంలో.. యూపీలో విజయం సాధించటం ద్వారా కాంగ్రెస్ తన సత్తా చాటాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొద్ది సమయాల్లో మాత్రమే రాజకీయ తెర మీద కనిపించి.. ఆ తర్వాత తన దారిన తాను వెళ్లే ప్రియాంక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలో నిలుస్తారని చెబుతున్నారు. నిజానికి ఈ ఐడియా.. తాజాగా కాంగ్రెస్ కు వ్యూహకర్తగా ఎంపికైన ప్రశాంత్ కిషోర్ దిగా చెబుతున్నారు. ఐడియా బాగుంది. మరి.. దీనికి సోనియా.. ప్రియాంకలు ఓకే అంటారా? అన్నది ప్రశ్న. దీనికి కాలం తప్పక సమాధానం చెప్పక మానదు.