Begin typing your search above and press return to search.
యుపీ ఎన్నికల్లో ఆమె దే కీలక పాత్ర?
By: Tupaki Desk | 25 Oct 2016 4:42 AM GMTసోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని, ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశముందని అప్పట్లో కథనాలు వచ్చాయి. సోదరుడు రాహుల్ గాంధీకి సాయం చేసేందుకే ప్రియాంక గాంధీకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఇదే క్రమంలో తన సోదరిని పార్టీలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ కూడా ప్రయత్నిస్తున్నారని.. పార్టీలో ఆమెకు కీలక బాధ్యత అప్పగించాలని రాహుల్ భావిస్తున్నారని వార్తలొచ్చేవి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు పలువురు భావించగా... రాహుల్ కు చెక్ పెట్టేందుకే ప్రియాంకను ఒక వర్గం ప్రోత్సహిస్తోందని ప్రత్యర్ధులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ విషయాలు కాసేపు పక్కనపెడితే తాజాగా ప్రియాంక గాంధీ రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోనున్నారని అనిపించే సంఘటన ఒకటి జరిగింది.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రియాంక గాంధీ యాక్టివ్ రోల్ పోషిస్తారని అంటున్నారు. ఇప్పటికే అధికార సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న తరుణంలో యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ హాజరయ్యారు. గులాంనబీ ఆజాద్ ఏర్పాటుచేసిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ - యూపీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ - ఎన్నికల ప్రచార వ్యూహకర్త సంజయ్ సింగ్ తదితరులు పాల్గొనగా, సుమారు గంటసేపు ఈ చర్చలు సాగాయి. ఈ కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ.. రాజ్ బబ్బర్ - షీలా దీక్షిత్ లతో కీలక విషయాలపై మాట్లాడారని, స్థానికంగా చిన్న చిన్న పార్టీలతో పొత్తులుపెట్టుకుంటే కలిగే ప్రయోజనంపై చర్చించారని కథనాలు వస్తున్నాయి.
త్వరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/