Begin typing your search above and press return to search.

ఇందిర లాంటి ముక్కుంటే సరిపోతుందా?

By:  Tupaki Desk   |   27 March 2019 2:39 PM GMT
ఇందిర లాంటి ముక్కుంటే సరిపోతుందా?
X
సోనియా గాంధీ తనయురాలు ప్రియాంక గాంధీ ఇటీవలే రాజకీయారంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె రావడం ఆలస్యం.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చేశారు కాంగ్రెస్ జనాలు. ఇందిర లాంటి రూపు - హేర్ స్టైల్ - డ్రెస్సింగ్‌ తో ఆమె తన నానమ్మను తలపించింది. భారత రాజకీయాలపై తిరుగులేని ముద్ర వేసిన ఇందిర లాగే ఉన్న ప్రియాంక ఆమె లాగే విజయవంతం అవుతుందని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఐతే ఈ పోలికలపై భారతీయ జనతా పార్టీ నాయకులు తమాషా చేస్తున్నారు. పోలికలున్నంత మాత్రాన ప్రియాంక ఇందిర అయిపోదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉన్నంత మాత్రాన ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో విజయవంతం కాలేదని.. ఆమెలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేదని అన్నాడు మాండవీయ. పోలికలున్నంత మాత్రాన రాజకీయాల్లో విజయవంతం అయ్యేట్లయితే..చైనాలో అందరి ముక్కులు ఒకేలా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడని వ్యంగ్యాస్త్రం విసిరాడు మాండవీయ. ‘‘ప్రియాంకా గాంధీకి తన నానమ్మ ఇందిరాగాంధీ లాంటి ముక్కు ఉందని అందరూ అంటున్నారు. మీరు మీ ముక్కు వల్ల అధికారంలోకి రాగలిగితే - చైనాలో ప్రతీ ఇంటి నుంచి ఓ అధ్యక్షుడు వస్తాడు కదా?’’ మాండవీయ ఎద్దేవా చేశాడు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో టాప్-జీన్స్ వేసుకుని తిరిగే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రాగానే చీ - సిందూరం ధరిస్తారని బీజేపీ నేత హరీశ్ ద్వివేదీ వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది.