Begin typing your search above and press return to search.

అర్ద‌రాత్రి .. ఇండియాగేట్ ద‌గ్గ‌ర ప్రియాంక‌

By:  Tupaki Desk   |   13 April 2018 10:39 AM GMT
అర్ద‌రాత్రి .. ఇండియాగేట్ ద‌గ్గ‌ర ప్రియాంక‌
X
రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లే ఉంటూ దూరంగా ఉండ‌టంలో ప్రియాంక గాంధీ నేర్ప‌రిత‌నం మ‌రెవ‌రికీ రాదంతే. సోద‌రుడికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇవ్వ‌టంతోపాటు.. ఆయ‌న‌కు అండ‌గా నిలిచేందుకు ఎప్పుడూ వెనుకాడ‌ని ప్రియాంక తాజాగా వార్త‌ల్లోకి వ‌చ్చారు.

అర్ద‌రాత్రి వేళ ఇండియా గేట్ ద‌గ్గ‌ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నిర్వ‌హించిన మెరుపు శాంతి ధ‌ర్నాకు సోద‌రి ప్రియాంక గాంధీ హాజ‌రై మ‌ద్ద‌తు ప‌లికారు. పోరాటానికి ఆమెది ఊహించ‌ని మ‌ద్ద‌తు. ఇప్ప‌టికే అనేక కోణాల్లో మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న వేళ‌.. జ‌మ్ముక‌శ్మీర్ లో వెలుగుచూసిన చిన్నారి దారుణ అత్యాచార ఉదంతం దేశంలో పెను క‌ల‌క‌లాన్ని రేపింది. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో యూపీలో బీజేపీ నేత‌ల అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో యోగి స‌ర్కారు నిండా మునిగింది. దీనిపై వివిధ వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

జ‌మ్ముక‌శ్మీర్ అత్యాచారం సంఘ‌నం దేశం గుండెను పిండేసిన విష‌యం విదిత‌మే. ఎనిమిదేళ్ల చిన్నారిని డ్ర‌గ్స్ ఇచ్చి అత్యంత పాశ‌వికంగా.. దారుణంగా సామూహిక‌ అత్యాచారం చేసిన వైనంపై యావ‌త్ దేశం ర‌గిలిపోతోంది.

దీనిపై నిర‌స‌న‌గా నిన్న (గురువారం) అర్ద‌రాత్రి దాటాక త‌ర్వాత ఇండియా గేట్ రాహుల్ గాంధీ శాంతి ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. దీనికి ప్రియాంక గాంధీ భ‌ర్త‌తో క‌లిసి హాజ‌రై నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌నం బాగా పెర‌గ‌డంతో మీడియా రిపోర్ట‌ర్లు కొంద‌రు ఇబ్బంది ప‌డ్డారు. దీంతో త‌న‌తో ఉన్న నిర‌స‌న‌కారుల్ని ఎలాంటి నినాదాలు చేయొద్ద‌ని.. నిశ్శ‌బ‌ద్దంగా ఉండాల‌ని ఆమె సూచించారు. రాత్రంతా ఇక్క‌డే ఉంటామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ స్పందిస్తూ... బేటీ ప‌డావో - బేటీ బ‌చావో అనే నినాదులు ఇస్తే అంతా స‌వ్యంగా మారిపోద‌ని, ప్ర‌భుత్వం ఏమైనా చ‌ర్య‌లు తీసుకుని మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఈ నిర‌స‌న‌లో మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రాతో పాటు కుమారుడితో క‌లిసి ప్రియాంక హాజ‌ర‌య్యారు. నిర‌స‌న‌కు హాజ‌రైన అంద‌రూ ప్ర‌శాంతంగా ఇంటికి వెళ్లాల‌ని సూచించారు. నిర‌స‌న సంద‌ర్భంగా ప‌లువురు నిర‌స‌న‌కారులు మోడీ భాగో.. బేటీ బ‌చావో అంటూ నినాదాలు చేశారు. అయితే.. ప్రియాంక మాత్రం ఎలాంటి నినాదాలు చేయొద్ద‌ని కామ్ గా ఉండాల‌న్నారు.

ఊహించ‌ని సంఖ్య‌లో జ‌నం రావ‌డంతో ఈ నిర‌స‌న‌లో పాల్గొన్న వారిని అదుపు చేయ‌టం పోలీసుల‌కు క‌ష్ట‌త‌రంగా మారిన‌ట్లు చెబుతున్నారు. ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్న వారిలో కొంద‌రు మ‌ద్యం సేవించి ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. వీరి నిర‌స‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ను తొల‌గించి వెళ్ల‌టంతో వారిని అదుపు చేయ‌టానికి భ‌ద్ర‌తా సిబ్బంది కిందామీదా ప‌డాల్సి వ‌చ్చిందట‌.