Begin typing your search above and press return to search.
ప్రియాంకకు పదవి..గంగలో మునిగిన తర్వాతే
By: Tupaki Desk | 26 Jan 2019 12:57 PM GMTకీలకమైన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా(47) నియమితులైన సంగతి తెలిసిందే. ఆమె ఫిబ్రవరి 4వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నూతన బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ఓ వైపు ఎవరికి వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రియాంక నియామకంపై బాబా రాందేవ్ స్పందిస్తూ మంచి యుద్ధం ప్రారంభమైందని స్పష్టమవుతోందని అన్నారు. దేశానికి ఇది మంచి పరిణామంగా అభివర్ణించారు. అయితే రానున్న కాలంలో ఏదైనా జరగొచ్చని చెప్పుకొచ్చారు బాబా రాందేవ్. ఎవరు లక్ష్యాన్ని చేరుకుంటారో వేచి చూడాలన్నారు. బీజేపీ నేత - బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా స్పందిస్తూ...ప్రియాంకా గాంధీ చాలా అందంగా ఉంటుంది కానీ ఆమెకు ఎలాంటి రాజకీయ ఘనత లేదు.. అంతేకాదు అందమైన మొహాలను చూసి ఎవరూ ఓటు వేయరు అని ఆయన అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంకా ప్రభావం అసలు యూపీలో ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా రకరకాల కామెంట్లకు కారణమైన ప్రియాంక పొలిటికల్ ఎంట్రీలో ఇంకో ఆసక్తికరమైన ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. ప్రియాంక తన నూతన బాధ్యతల స్వీకరణ కంటే ముందు.. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాతే రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న రాహుల్ - ప్రియాంక కలిసి పవిత్రస్నానాలు ఆచరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించి.. ఇద్దరూ కలిసి లక్నోలో మీడియాతో మాట్లాడుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ 4వ తేదీన వీలు కాకపోతే 10వ తేదీన వసంత పంచమి రోజున ప్రియాంక పవిత్ర స్నానం ఆచరించనున్నారు. 2001లో సోనియా గాంధీ కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానం ఆచరించారు. అయితే హిందుత్వ వాదులను ఆకట్టుకునేందుకు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానం ఆచరించేందుకు రాహుల్ - ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.