Begin typing your search above and press return to search.
రాహుల్ వదిలేసిన పగ్గాలు ఆమెకేనా?
By: Tupaki Desk | 8 July 2019 2:42 PM GMTచాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలను గాంధీ కుటుంబీకులు వదిలేశారు. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సోనియాగాంధీ చేతిలో ఉన్న ఏఐసీసీ పగ్గాలు కొంత కాలం కిందట ఆమె తనయుడు రాహుల్ గాంధీకి దక్కాయి. అయితే రాహుల్ పట్టాభిషిక్తుడు అయ్యాకా కనీసం రెండేళ్లు కూడా ఆ హోదాలో సరిగా ఉండలేదు.
ఎన్నికలు రావడం - పార్టీ చిత్తయిపోవడంతో రాహుల్ బెంబేలెత్తిపోయాడు. ఆఖరికి తల్లి వారించినా - చెల్లి చెప్పినా రాహుల్ మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగలేదు. రాజీనామాకు కట్టుబడ్డాడు. రాజీనే లేదన్నాడు.
ఇక రాహుల్ స్థానంలో ఇప్పుడు ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగా పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి - వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో రాహుల్ స్థానంలో తిరిగి గాంధీ కుటుంబీకులే ఎవరో ఒకరు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ లో కొంతమంది అంటున్నారు. రాహుల్ ఆ పగ్గాలు వదిలేశాడు కాబట్టి.. ఆ పదవిని ప్రియాంక స్వీకరించాలని వారు అంటున్నారు.
ఎలాగూ గాంధీ కుటుంబీకులు కాకుండా మరెవరైనా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నా వారు చేసేది - చేయగలిగేది ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ప్రియాంకే ఆ బాధ్యతలు తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా నిలుస్తోంది!