Begin typing your search above and press return to search.
ప్రియాంక వాద్రా.. అంత సాహసం చేస్తుందా?
By: Tupaki Desk | 30 March 2019 5:22 AM GMTవారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రియాంక వాద్రా ఢీ కొడుతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. మోడీ మీద ప్రియాంక పోటీ చేస్తుందనే మాట వినిపిస్తూ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు ఏమీ లేవు. ఈ విషయం మీద ప్రియాంకనే ఆరా తీసింది మీడియా. ‘వారణాసిలో మోడీ మీద పోటీ చేస్తారా?’ అనే ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ.. ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ’ అనే సమాధానం ఇచ్చింది.
ఇది కొంచెం డొంకతిరుగుడు సమాధానమే అని చెప్పాలి. పోటీ చేయడం, చేయకపోవడం ప్రియాంక ఉత్సాహం , ఆమె ఇష్టం అవుతుంది. ఆమె పోటీ చేయాలని అనుకుంటే పార్టీ కాదంటుందా? నెహ్రూ-గాంధీ వారసులకు కాంగ్రెస్ లో ఎదురు చెప్పే వాళ్లు ఉంటారా? మోడీని ఎంపీగా ఓడించాలని ఆమె గట్టిగా అనుకుంటే.. ఆయన మీద పోటీ చేయాలి. అంతే కానీ..’పార్టీ ఆదేశిస్తే’ అంటూ పాత కాలం మాటలు మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితి లేదు.
గత ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ మీద పలువురు పోటీ చేశారు. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. మోడీ మీద పోటీ చేసి బాగానే ఓట్లను సంపాదించుకున్నారు కేజ్రీవాల్. రెండు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండో స్థానం కేజ్రీకే దక్కింది. అయితే మోడీకి వచ్చిన మెజారిటీ మూడున్నర లక్షల ఓట్లకు పైనే!
అప్పుడు బీఎస్పీ కూడా వారణాసిలో పోటీ చేసింది. దీంతో కొంత ఓట్ల చీలక తప్పలేదు. ఈ సారి గనుక యూపీలోని అన్ని పార్టీలు, కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థిని వారణాసిలో మోడీ మీద నిలబెడితే పోటీ రంజుగా ఉంటుంది. ప్రియాంక ఆ అభ్యర్థి అయితే మరింత రసవత్తరంగా ఉంటుంది. ఈ అంశాలపై పూర్తి క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది!