Begin typing your search above and press return to search.
చెల్లికి మరో గౌరవం ఇచ్చిన రాహుల్
By: Tupaki Desk | 5 Feb 2019 12:10 PM GMTకీలకమైన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా(47) నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు మరో గౌరవం కల్పించారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ లోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో ఓ గదిని కేటాయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇదే కార్యాలయంలో ఉన్నారు. అంతకుముందు ఈ గది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేదీ - సుశీల్ కుమార్ షిండెల కార్యాలయంగా ఉండేది.
గత నెలలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాను రాహుల్ నియమించిన విషయం తెలిసిందే. యూపీ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్‌చార్జ్‌ను చేశారు. అయితే యూపీని మించి జాతీయ స్థాయిలో ఆమె పాత్ర ఉంటుందని రాహుల్ మంగళవారం స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే.. కచ్చితంగా అది జాతీయ స్థాయి పాత్రే అని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం రాహుల్ తో ప్రియాంకా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గురువారం వివిధ రాష్ర్టాల ఇన్ చార్జ్ లు - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఆమె పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే లోక్ సభ ఎన్నికల వ్యూహాలను కాంగ్రెస్ రచించనుంది.
కాగా, ఫిబ్రవరి 4వ తేదీనే ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. రాబోయే రోజుల్లో ఆమె ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజా ఏర్పాట్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఆమె పర్యటను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.