Begin typing your search above and press return to search.

ప్రియాంక చేసిన త‌ప్పు అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   12 May 2019 1:30 AM GMT
ప్రియాంక చేసిన త‌ప్పు అదేన‌ట‌!
X
త‌ప్పులు అంద‌రూ చేస్తుంటారు. వారిలో కొద్దిమంది మాత్ర‌మే తాము చేసిన త‌ప్పుల్ని ఒప్పుకొని బుద్దిగా చెంప‌లు వేసుకుంటారు. సామాన్యుల సంగ‌తి ఇలా ఉంటే.. ప్ర‌ముఖుల సంగ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ తాజాగా తాను చేసిన త‌ప్పును ఓపెన్ గా ఒప్పుకోవ‌ట‌మే కాదు.. రాబోయే రోజుల్లో తాను ఆ త‌ప్పు చేయ‌న‌ని చెప్పారు.

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆమె చాలా విష‌యాలు వెల్ల‌డించారు. గ‌తంలో త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని రాహుల్ ఆహ్వానిస్తే.. తాను నో చెప్పి త‌ప్పు చేశాన‌న్నారు. అప్ప‌ట్లో రాహుల్ త‌న‌ను జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కానీ.. యూపీలో పార్టీ ప‌ద‌విని చేప‌ట్ట‌మ‌ని కోరారు. అయితే.. తాను నో చెప్పిన‌ట్లుగా చెప్పారు. మ‌నిషి త‌ప్పుల నుంచి నేర్చుకుంటార‌ని.. తాను అలానే నేర్చుకుంటాన‌ని చెప్పారు.

ఈ కార‌ణంతోనే త‌న‌ను రెండోసారి రాజ‌కీయాల్లోకి వ‌స్తావా? అని సోద‌రుడు ఆహ్వానించిన‌ప్పుడు మ‌రింకేమీ ఆలోచించ‌కుండా పార్టీలోకి వ‌చ్చిన‌ట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. త‌న భ‌ర్త మీద ప్రారంభించిన కేసు ద‌ర్యాఫ్తుపై త‌న‌కుఎలాంటి ఆందోన‌లు లేవ‌న్నారు. త‌న నాన‌మ్మ ఇందిరాగాంధీతో త‌న‌ను పోలుస్తున్నార‌ని.. దీంతో త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో వ్య‌వ‌స్థ‌లో క‌ష్టాలు ఉన్న‌ప్పుడు అందుకు భ‌య‌ప‌డ‌కుండా రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ కార‌ణంతోనే తాను పార్టీలోకి వ‌చ్చిన విష‌యాన్ని వెల్ల‌డించారు. తూర్పు ప్రాంతంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌న‌ను ప్ర‌చారంలో భాగంగా త‌మ వ‌ద్ద‌కు రావాల‌న్న ఒత్తిళ్లు అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా ప్రియాంక తెలిపారు. మొత్తానికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ సంగ‌తి ఎలా ఉన్నా.. త‌న ఇమేజ్ ను పెంచుకున్న ప్ర‌య‌త్నం ఆమె భారీగా చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.