Begin typing your search above and press return to search.
ప్రియాంక ఓ మెంటల్ కేసు అంటున్న ఎంపీ
By: Tupaki Desk | 27 Jan 2019 9:50 AM GMTకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితురాలు అవడంపై చర్చోపచర్చలు - విమర్శలు కొనసాగతున్నాయి. పూర్వాంచల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు తీసుకోబోతున్నారని కాంగ్రెస్ ప్రకటించాక కొందరు బీజేపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక అందంగా ఉంటారని - కానీ అందానికి ఓట్లు రాలవని బీహార్ మంత్రి వినోద్ నారాయన్ ఝా అన్నారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు - ఎంపీ సుబ్రమణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మెంటల్ కేస్ అని కలకలం రేపే కామెంట్లు చేశారు.
తాజాగా ఓ మీడియా సంస్థతో సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ రాజకీయాలకు ఫిట్ కాదని - ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని - మానసికంగా బ్యాలెన్స్ తప్పితే ప్రజలను కొట్టే ప్రమాదం ఉందని చెప్పారు. ``ప్రియాంకగాంధీకి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక రోగం ఉంది. ప్రజా జీవితానికి పనికిరాదు. ఆమె దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి`` అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రియాంక రూపంలో ఎంతో ఆశిస్తోంది కానీ ఆ ఫలితాలు నెరవేరవని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా - కుంభమేళా సందర్భంగా వచ్చే నెల 4న గంగానది లో పవిత్ర స్నానం చేశాక బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక ఫిబ్రవరి 4న లక్నోలో తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తున్నది. మౌని అమావాస్య నాడు (ఫిబ్రవరి 4) ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేయాలని ప్రియాంక, రాహుల్ నిర్ణయించుకున్నట్టు అభిజ్ఞ వర్గాల కథనం. ఒకవేళ 4న సాధ్యపడకపోతే వసంత పంచమి నాడు 10న వారు పుణ్యస్నానం చేయొచ్చని ఆ వార్తా సంస్థ పేర్కొంది.