Begin typing your search above and press return to search.
ప్రియాంకా గాంధీ పగ్గాలు చేపట్టక తప్పదా?
By: Tupaki Desk | 14 Feb 2020 3:30 AM GMTగతంలో ఓ వెలుగు వెలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ....గత పదేళ్లుగా చతికిలబడ్డ సంగతి తెలిసిందే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా కుదేలయిపోయింది. ఓ పక్క మోడీని దీటుగా ఎదుర్కొన లేక ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తన వారసుడిని తయారు చేద్దామనుకున్న సోనియా కలలు కల్లలు కావడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత పార్టీని నడిపే పూర్తి స్థాయి అధ్యక్షులపై చర్చ మొదలైంది. దివంగత నేత షీలా దీక్షిత్ లేని లోటు ఈ ఎన్నికల్లో కనిపించిందని కార్యకర్తలు అనుకుంటున్నారు. కనీసం 2024 సార్వత్రిక ఎన్నికల నాటికైనా...ఢిల్లీతో పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టగలిగే నాయకత్వం కోసం అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోనియానే తాత్కాలిక లేక శాశ్వత అధ్యక్షురాలిగా కొనసాగుతారా...లేక పూర్తి గాంధీ ఫ్యామిలీకి చెందని వ్యక్తిని అధ్యక్ష పదవిలో నియమిస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలో జరగబోయే ప్లీనరీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చట. సోనియా అనారోగ్య కారణాలతో పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా పదవి చేపట్టక పోవచ్చని అనుకుంటున్నారు. రాహుల్ ఆ పదవి చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఇక, రాహుల్ ను కాదని ప్రియాంక గాంధీ రేసులో వస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాయనమ్మ ఇందిర లాగా ప్రియాంకా పార్టీ పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.