Begin typing your search above and press return to search.

మీడియాతో ప్రియాంక నిష్టురాలు

By:  Tupaki Desk   |   22 Jun 2016 2:50 PM GMT
మీడియాతో ప్రియాంక నిష్టురాలు
X
కాంగ్రెస్ పార్టీ ముద్దుల అల్లుడు రాబర్ట్ వాద్రా చిక్కుల్లో పడటం తలిసిందే. ఆయన కొనుగోలు చేసిన భూములపై ఈడీ దృష్టి సారించటం.. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసి.. విచారణకు హాజరు కావాలని పేర్కొనటం తెలిసిందే. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేసుకొనే మోడీ సర్కారు ఇలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. భర్తకు ఈడీ జారీ చేసిన సమన్ల మీద ప్రియాంక రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె.. నిష్ఠురాలు ఆడటం గమనార్హం.

రాజస్థాన్ లో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై తన వాదనను వినిపించుకునేందుకు వాద్రా హాజరు కావాలంటూ ఈడీ నోలీసులు జారీ చేసిన అంశం తమకు ఈ రోజే తెలిసిందని ప్రియాంక పేర్కొన్నారు. ఈ సందర్భంగ కాస్త నిష్ఠురాలు ఆడిన ఆమె.. ‘‘ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాకు నోటీసులు అందాయి. కానీ.. ఈ విషయం మీకు మాత్రం నిన్ననే తెలిసింది’’ అని వ్యాఖ్యానించారు. ఉద్దేశ పూర్వకంగానే మోడీ సర్కారు వాద్రా నోటీసుల వ్యవహారాన్ని ముందుగానే లీక్ చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.