Begin typing your search above and press return to search.
ప్రియాంకా గాంధీకి డెంగీ సోకిందే!
By: Tupaki Desk | 25 Aug 2017 12:16 PM GMTదేశ రాజధాని ఢిల్లీని డెంగీ మహమ్మారి పట్టి పీడిస్తోంది. డెంగీ సహా విష జ్వరాల విజృంభణతో ఆ నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన డెంగీ కేసుల్లో ఢిల్లీలో నమోదైన కేసులే 325 ఉన్నాయంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఇట్టే అర్థం కాక మానదు. అయినా డెంగీ - విష జ్వరాలు సాధారణ జనానికే అంటుకుంటాయని, ఉన్నత కుటుంబాలకు చెందిన వారి దరికి చేరవన్న వాదనలకు పస లేదని తేలిపోయింది.
ఇప్పుడు ఢిల్లీ ప్రజలను వణికిస్తున్న డెంగీ జ్వరం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబాన్ని కూడా వణికిస్తోందనే చెప్పాలి. ఇప్పటికే కేన్సర్ కారణంగా ఇటీవలి కాలంలో పలు మార్లు ఆసుపత్రిలో చేరిన సోనియా ఇప్పుడిప్పుడే కాస్తంత కోలుకుంటున్నారని చెప్పాలి. ఈ క్రమంలో ఆమె కూతురు ప్రియాంకా గాంధీకి డెంగీ జ్వరం సోకిందట. డెంగీ జ్వరం కారణంగా ప్రియాంకను ఆమె కుటుంబ సభ్యులు గంగారాం మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. మొన్నామధ్య సోనియా గాంధీ కూడా గంగారాం ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. సోనియాకు చికిత్స అందించిన ఆసుపత్రికే ప్రియాంకా గాంధీ కూడా వెళ్లారు.
ఇదిలా ఉంటే... కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో పారిశుద్ధ్యం లోపించిన కారణంగానే డెంగీ సహా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా ఉన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పాలనలో దిట్టగానే చెబుతారు. అంతేనా.. తమ పాలనలోని ఢిల్లీలో శాంతి భద్రతల పర్యవేక్షణ కూడా తమ పరిధి కిందకే రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొని ఓ దఫా రాజీనామా కూడా చేశారు. మరి శాంతి భద్రతలను తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు చూపించే శ్రద్ధను నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఎందుకు చూపరన్న ప్రశ్న ఇప్పుడు కేజ్రీని సూటిగా తాకుతోంది. ఈ ప్రశ్నకు కేజ్రీ ఎంతటి క్రేజీ సమాధానం చెబుతారో చూడాలి.