Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ప్లాన్ మారింది..ప్రియాంక కొత్త ట్విస్ట్ ఇవ్వనుంది
By: Tupaki Desk | 20 April 2019 7:09 AM GMTప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకు తగిన కసరత్తును ప్రణాళికబద్దంగా - వ్యూహాత్మకంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో తాజాగా కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియాంకాగాంధీ విషయంలో ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. ఆమె పోటీ చేయడంపై క్రేజ్ ను సృష్టిస్తోంది. ప్రియాంక గాంధీ యూపీ నుంచి పోటీ చేసి లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించవచ్చనే వాదనా వినవస్తోంది.
సాధారణంగా పెద్ద నాయకులు తమ గెలుపుపై అనుమానం ఉంటే.. రెండు స్థానాల్లో పోటీ చేయడం సహజం. అయితే ఆసక్తికరంగా - ప్రియాంక గాంధీ సోదరుడు - ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అమేథి నుంచి - కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథిలో రాహుల్ గెలుపుకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకా లేదు. అయినా.. ఆయన వయనాడ్ ను కూడా ఎందుకు ఎంచుకున్నారన్నది కీలక ప్రశ్న! ఈసారి రాహుల్ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయడం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయని అంటున్నారు. మొదటిది.. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొని రావడంలో భాగంగానే రాహుల్ వయనాడ్ ను ఎంచుకున్నారని అంటున్నారు. అక్కడి విజయ్ పినరయి ప్రభుత్వాన్ని దించి...కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేరళ కాంగ్రెస్ శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి రాహుల్‌గాంధీ వయనాడ్‌లో పోటీ చేస్తున్నారనే వాదన వినవస్తోంది. ఇక శబరిమలై వివాదంలో పినరయ్ ప్రభుత్వం అవలంభించిన వైఖరి, తీసుకున్న చర్యలు కేరళ హిందువులకు తీవ్ర అగ్రహాన్ని కలిగించాయి. అక్కడి హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయ పర్చాయి. దీన్ని ఓట్ల రూపంలోకి బీజేపీ మలుచుకొనే అవకాశముందని భావించిన కాంగ్రెస్ ఏకంగా రాహుల్ గాంధీనే రంగంలోకి దింపిందనే వాదన ఉంది. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేయడం ద్వారా అక్కడి హిందువుల ఓట్లను కాంగ్రెస్ వైపునకు మరల్చడంతో పాటు.. దక్షిణాది నాయకుడిగా కూడా పేరు తెచ్చుకోవాలనే తపన ఆయనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అమేథిలో గెలిచినా...వయనాడ్‌లో ఓడిపోతే.. దాని ప్రభావం పార్టీపై స్థూలంగా పడే ప్రభావం ఉంటుంది. పైగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రయత్నంలో తలమునకలై ఉన్న…కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రయోగాలు చేసే స్థితిలో లేదు. అందునా రాహుల్ గాంధీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలా చూసినా...వయనాడ్‌లో రాహుల్ గాంధీ గెలవడం ఖాయమేనని భావించాల్సి వస్తుంది. మరి వయనాడ్‌లో గ్యారెంటీ గెలుపు ఉన్నా.. అమేధీలోనూ పోటీ చేయడంలోని మర్మంపై విశ్లేషకులు కన్నేశారు. రాహుల్ కేరళలోని వయనాడ్‌లో గెలవడం ఖాయ మని కాంగ్రెస్ దృఢంగా భావిస్తోంది. అయినా అమేధీలోనూ ఆయన్ను పోటీకి దింపడంలో ఉన్న మరో కోణమే ప్రియాంకగాంధీ! అవును…ప్రియాంక గాంధీని అమేథి నుంచి పార్లమెంటుకి పం పాలనే సుదీర్ఘ లక్ష్యంగా కాంగ్రెస్ ఆచీతూచీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది.