Begin typing your search above and press return to search.
వాట్సాప్ తో ప్రియాంక ఫోన్ హ్యాక్
By: Tupaki Desk | 3 Nov 2019 6:44 PM GMTమోడీ సర్కారు మీద కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. సోనియా గాంధీ తనయురాలు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఒకరైన ప్రియాంక గాంధీ ఫోన్ ను హ్యాక్ చేసినట్లుగా ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్ వేర్ ద్వారా ఆమె ఫోన్ హ్యాక్ చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. ప్రియాంకతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ - మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను కూడా ప్రభుత్వమే హ్యాక్ చేసిందని ఆరోపించింది. దాదాపు వెయ్కి పైగా నేతలు - ప్రముఖుల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రియాంక ఫోన్‌ను వాట్సాప్ ద్వారా ప్రభుత్వమే హ్యాక్ చేసిందన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఘటనపై విచారణ జరుపాలని డిమాండ్ చేసింది. ఏప్రిల్‌లో హ్యాకింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థం ఎన్ ఎస్ వో స్పైవేర్ పెగాసన్ వ్యాప్తి చేసేందుకు వాట్సాప్ సర్వర్ ఉపయోగించిందని .. 20 దేశాలకు చెందిన 1400 మంది వినియోగదారుల డేటా సేకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫోన్లు హ్యాక్ అయిన భారతీయుల్లో రాజకీయ నాయకులు - ఉద్యమకారులు - జర్నలిస్టులు - లాయర్లు - అధికారులు ఉన్నారని అంటున్నారు. మరి ఈ సంచలన ఆరోపణలపై మోడీ సర్కారు ఏమని బదులిస్తుందో చూడాలి.