Begin typing your search above and press return to search.
శివరాత్రి రోజే ప్రియాంకా, కత్రినా, దీపికా పెళ్లి!
By: Tupaki Desk | 23 Feb 2017 10:37 AM GMTప్రియాంక చోప్రా - కత్రినాకైఫ్ - దీపికా పదుకొనె పెళ్లి ఒకే రోజు అంటూ మీరు చదివింది నిజమే! అది కూడా ఈ శివరాత్రి మహా పర్వదినాన ఈ ముగ్గురు పెళ్లి చేసుకోబోతున్నారు! వీరి కోసం స్వయంవరం కూడా ఏర్పాటుచేశారు. అయితే మీరు అనుకుంటున్నట్లు ఈ ముగ్గురు బాలీవుడ్ తారలు కాదు... అవి మేకల పేర్లు!! ఉత్తరాఖండ్ లోని తెహ్రి జిల్లా పంట్వాడీ ఊళ్లో ఉన్న ఈ మూడు మేకలకు ఆ గ్రామస్థులు శివరాత్రి రోజు పెళ్లి చేయబోతున్నారు. దీనికోసం స్వయంవరం కూడా ఏర్పాటు చేయడం విశేషం. 15 మేకల నుంచి ఈ మూడు తమకు కావాల్సిన భాగస్వాములను ఎంపిక చేసుకోనున్నాయి. ఓ రింగ్ లో ఐదేసి చొప్పున ఉండే మేకల నుంచి తమకు కావాల్సిన భాగస్వామిని ఈ మూడు మేకలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అసలు ఏంటి దీని కథాకమామిషు అంటూ....ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో జంతువులకు ఇలా స్వయంవరాలు ఏర్పాటుచేయడం వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. మనుషులకు చేసినట్లే పూజారి - బ్యాండ్ బాజా అన్నీ ఈ మేకల పెళ్లిళ్లలోనూ ఉంటాయి. ఈ పెళ్లికి శుభలేఖలు కూడా అచ్చు వేశారు. పెళ్లికూతుళ్లకు పసుపు, మెహెందీ, తిలకాలతో ముస్తాబు చేస్తారు. వీటి ఆరోగ్యం ఎలా ఉందో చూడటానికి పెళ్లి రోజు పశువుల డాక్టర్లు కూడా అక్కడికి వస్తారు. ఇలాంటి స్వయంవరాలు పశు సంపదను వృద్ధి చేస్తాయని చెప్తున్నారు. గ్రీన్ పీపుల్ ఆర్గనైజేషన్ సాయంతో ఆ గ్రామస్థులు ఈ పెళ్లిళ్లు చేయనున్నారు. అదండి ఈ పెళ్లిల తాలుకు వివరాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/