Begin typing your search above and press return to search.
ప్రియాంక చేతికి కాంగ్రెస్ పగ్గాలు
By: Tupaki Desk | 19 March 2020 2:00 PM GMTఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. దేశానికి కాంగ్రెస్ తప్పించి మరెవరూ ప్రత్యామ్నాయం కాదన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి.. కనుచూపు మేరలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నట్లుగా మారిన దుస్థితి. ఇదంతా ఆ పార్టీ తనకు తాను చేసుకున్నదిగా పలువురు విశ్లేషిస్తారు. పార్టీకి కొత్త కళ తెచ్చేందుకు కుమారరత్నానికి కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేని సంగతి తెలిసిందే. పార్టీ ఓటమిని తన ఖాతాలో వేసుకోవటాన్ని తప్పు పట్టలేకపోయినా.. కష్టాల్లో ఉన్న వేళ నావను వదిలేసిన నాయకుడిగా రాహుల్ మారారు.
ఎట్టి పరిస్థితుల్లోపార్టీ పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదన్న మొండివైఖరిని వదలని నేపథ్యంలో పార్టీని ఒక గాటున పెట్టేందుకు సోనియమ్మ మళ్లీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి పరిస్థితులు మెరుగుపడటం లేదు. అదే సమయంలో ఆమె అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న వేళ.. పార్టీ పగ్గాలు ప్రియాంకకు తాత్కాలికంగా అప్పజెప్పాలన్న ఆలోచన లో ఉన్నట్లు చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాల తర్వాత ఏఐసీసీ ప్లీనరీ నిర్వహించి.. అందులో పార్టీ కొత్త అధ్యక్షుడిని.. కొత్త వర్కింగ్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కరోనా కారణంగా ప్లీనరీ వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లీనరీని నిర్వహించటం సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాల్ని తాత్కాలికంగా ప్రియాంక చేతికి అప్పజెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీకి చెందిన అత్యధికులు ప్రియాంక వైపే మొగ్గు చూపిన నేపథ్యం లో ఆమె పేరును అధికారికంగా ప్రకటించే వీలున్నట్లు తెలుస్తోంది.