Begin typing your search above and press return to search.
మరోసారి చీపురు పట్టిన ప్రియాంక.. ఎందుకంటే
By: Tupaki Desk | 9 Oct 2021 10:16 AM GMTయూపీలోని లఖింపూర్ ఘటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిని క్యాష్ చేసుకొనేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. పోటాపోటీగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీనిని ఓ అస్త్రంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు.
యూపీ కాంగ్రెస్ బాధ్యతలను భుజనా మోసుకున్న ప్రియాంక, మరోసారి చీపురు పట్టి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు కౌంటర్ ఇచ్చారు. దీన్నొక ఆత్మగౌరవ చర్యగా అభివర్ణించారు. లఖింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కారణం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఆందోళనలు చేపడుతోంది. మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లఖింపూర్ కు చేరుకున్నారు. యూపీ పోలీసులు ఆమెను అడ్డుకుని…సీతాపూర్ గెస్ట్ హౌస్ లో నిర్భందించారు.
ఆ సమయంలో ఆమె చీపురు పట్టి, తన గదిని శుభ్రం చేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై సీఎం యోగి..పలు విమర్శలు గుప్పించారు. ఆమెకు ఆ పనులు సరిపోతాయనే అర్థం వచ్చేలా…వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటికి కౌంటర్ ఇస్తూ…ప్రియాంక..లఖింపూర్ లో ఓ దళిత వాడలో అకస్మికంగా పర్యటించారు. అక్కడ కాళ్లకు చెప్పులు లేకుండా..చీపురు పట్టుకుని…శుభ్రం చేశారు. దాన్నొక ఆత్మగౌరవ చర్యగా అభివర్ణించారు. పార్టీలోని అన్ని జిల్లా కమిటీలు శనివారం వాల్మీకి దేవాలయాలను శుభ్రం చేస్తాయని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ, మాట్లాడారు. ఆ మాటల ద్వారా తనను ఒక్కరినే అవమానించలేదని సీఎం యోగిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ పని చేసే కార్మికులందరినీ అవమానించారని, వారితో పాటు తాను ఇక్కడ పని చేసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. పరిసరాలను శుభ్రం చేయడం,చీపురు పట్టడం ఆత్మగౌరవ చర్య అని తెలియచేయడానికే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఈ సమయంలో అక్కడ పారిశుధ్య కార్మికులు వీధులను శుభ్రం చేస్తూ ఉన్నారు. యూపీలో పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి ప్రియాంక గాంధీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర సక్సెస్ అవుతాయో చూడాలి .

झाड़ू लगाना स्वाभिमान का काम है।
— UP Congress (@INCUttarPradesh) October 8, 2021
अपनी सोच बदलिए @myogiadityanath pic.twitter.com/E3S6eTxjrZ