Begin typing your search above and press return to search.

'దీదీ' ని ఢీ కొట్టే బీజేపీ అభ్యర్థి ఈమె .. ఎవరంటే ?

By:  Tupaki Desk   |   10 Sep 2021 9:37 AM GMT
దీదీ ని ఢీ కొట్టే బీజేపీ అభ్యర్థి ఈమె .. ఎవరంటే ?
X
ప్రస్తుతం దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక త్వరలోనే జరగనున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసి అనూహ్యంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చినా దీదీ ఓటమి చెందడం గమనార్హం. ఆ సమయంలో బీజేపీ పన్నిన వ్యూహాలు అన్ని ఇన్ని కావు. అన్ని వ్యూహాలు పాలించి మమతా బెనర్జీ అయితే ఓటమి చెందింది కానీ పార్టీ మాత్రం గెలుపొందింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన దీదీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. అయితే ఆరు నెలల్లోపు ఆమె ఎదో ఒక ఎన్నికల్లో గెలుపొందాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది.

దీని తో అతి త్వరలో పశ్చిమబెంగాల్ భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతాబెనర్జీ రంగంలోకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం ఆమెతో పాటుగా పార్టీకి కూడా చాలా ముఖ్యం. దీనితో అక్కడ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని శుక్రవారం ప్రకటించింది. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న సీఎం మమతాబెనర్జీ పై బీజేపీ అభ్యర్థినిగా ప్రియాంక తిబ్రేవాల్ ను కమలనాథులు బరిలోకి దింపుతున్నారు.

బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులో పోరాడుతున్న లాయర్ ప్రియాంక తిబ్రేవాల్ మమతాబెనర్జీ పై పోటీకి దింపింది. 41 ఏళ్ల ప్రియాంక తిబ్రేవాల్ కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. ఈమె 2014 లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రియాంకను ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీలోకి తీసుకువచ్చారు.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా నందిగ్రామ్‌లో బీజేపీ ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.

ఓట్ల తేడా 1959 మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని సవాలు చేశారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఆరు నెలల పాటు రాష్ట్ర శాసనసభలో సభ్యత్వం లేని ఏ మంత్రి అయినా మంత్రిగా ఉండకూడదు. టీఎంసీ గెలుపొందిన అభ్యర్థి శోభందేబ్ చటోపాధ్యాయ్ సెప్టెంబర్ 30 న భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి పోటీ చేసేలా సీటును ఖాళీ చేశారు. గతంలో మమతా బెనర్జీ ఒకే స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు.