Begin typing your search above and press return to search.

ఆడవాళ్లు అధికారాన్ని లాక్కోవాలి .. అప్పుడే అర్ధరాత్రి తిరగగలం !

By:  Tupaki Desk   |   7 Dec 2019 6:42 AM GMT
ఆడవాళ్లు అధికారాన్ని లాక్కోవాలి .. అప్పుడే అర్ధరాత్రి తిరగగలం !
X
ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి నడిరోడ్డుపై ఎప్పుడైతే ఎటువంటి భయం లేకుండా తిరుగుతుందో అప్పుడే మనకి నిజమైన స్వాసంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చెప్పారు. అయన మాటలని బట్టి చూస్తే మన దేశానికి ఇప్పటికి కూడా స్వాసంత్రం రానట్టే. మనమే మనకి స్వాసంత్రం వచ్చింది అనే భ్రమలో బ్రతుకుతున్నాం. అర్ధరాత్రి కాదు కదా ..ఒక ఆడపిల్ల మట్ట మధ్యాహ్నం రోడ్డు పైకి రావడానికి కూడా భయపడే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. దీనికి ప్రతి ఒక్కరం కూడా సిగ్గుపడాలి. నిజంగా మనకి స్వాసంత్రం వచ్చింటే ..ఓ దిశ , ఓ ఉన్నావ్ , ఓ నిర్భయ ..ఈ రోజు మన కళ్ల ముందు హాయిగా తమ జీవితాన్ని గడిపేవారు.

కానీ , ఈ సమాజంలో ఉన్న కొందరు మానవ మృగాళ్లు వారి జీవితాలని అన్యాయంగా నాశనం చేసారు. పోలీసులు , ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ..రోజురోజుకి ఇలాంటి కామాంధులు పెరిగిపోతున్నారే తప్ప ..తగ్గడం లేదు. మన దేశంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే .. ఇలాంటి ఘోరాలని చేసిన వారి నడిరోడ్డు పై ఉరి తీస్తేనో , ఎన్ కౌంటర్ చేస్తేనో ఈ సమస్య అక్కడితో తీరిపోదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మార్పు రావాలి. ఆపద సమయంలో తన కోసం ఫైట్ చేసే శక్తి , తెగింపు ఉండాలి.

ఇకపోతే , ఈ మహిళలపై జరిగే దారుణాలపై స్పదించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ .. తమను తాము కాపాడుకోవడానికి మహిళలు జనాభా దామాషా ప్రకారం పురుషుల నుంచి అధికారాన్ని లాక్కోవాలని అన్నారు. మహిళలు అధికారంలోకి రావాలని నా అభిప్రాయం. హింసకు వ్యతిరేకంగా పంచాయితీ, శాసన సభలకు పోటీ చేసి రాజకీయాల్లోకి రండి. తద్వారా మీకు అధికారం లభిస్తుంది. దాంతో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టవచ్చు అని తెలిపారు.

లక్నోలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విధంగా మాట్లాడారు. అలాగే ఇదే సందర్భంలో మాట్లాడుతూ ..యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాల కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. ఉన్నావ్‌ ఘటనే దీనికి నిదర్శనం అంటూ తెలిపారు. మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టడానికి తీసుకోదగిన చర్యలను వివరించారు. ఇది రాజకీయ సమస్య కాదని, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల భద్రతకు సంబంధించిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దిశ ఉదంతం పై స్పందిస్తూ .. ఎప్పుడైనా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని తెలిపారు.