Begin typing your search above and press return to search.

ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్, ఓడిన పాక్ లకు ప్రైజ్ మనీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   14 Nov 2022 6:04 AM GMT
ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్, ఓడిన పాక్ లకు ప్రైజ్ మనీ ఎంతంటే?
X
టీ20 ప్రపంచ కప్ -2022 కోసం ఐసీసీ మొత్తం రూ. 45.08 కోట్ల ($5.6 మిలియన్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. సెమీఫైనలిస్ట్‌ల వరకు చేరిన టీమ్ ఇండియా నుంచి విజేతలుగా నిలిచిన ఇంగ్లాండ్ వరకు.. ప్రతి జట్టుకు అందించే నగదు బహుమతులు ఇక్కడ ఉన్నాయి. భారీగా బహుమానం పొందనున్నారు..

ఛాంపియన్స్: ఇంగ్లండ్ వారి రెండవ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. 2010 తర్వాత రెండో కప్ ను ఈసారి అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఫైనల్ లో విజయవంతంగా ఓడించింది. సూపర్ 12 దశలో ఇంగ్లండ్ జట్టు గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచింది. ఐసీపీ టీ20 కప్ కొట్టిన ఇంగ్లండ్ కు $1.6 మిలియన్ల నగదు బహుమతిని అందుకుంది. అంటే దాదాపు రూ. 12.88 కోట్లు బహుమతిగా దక్కాయి..

రన్నర్స్-అప్: పాకిస్తాన్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లకపోయినా, వారు ఖచ్చితంగా $0.8 మిలియన్ల నగదు బహుమతిని తీసుకుంటారు. అంటే దాదాపు రూ. 6.44 కోట్లు అందుతుంది.

ఓడిపోయిన సెమీఫైనలిస్టులు: భారత్ -న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌లో నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు $400,000 డాలర్ల నగదు బహుమతిని అందుకుంటున్నారు. దాదాపు చెరో 3.22 కోట్లు అందుతాయి.

సూపర్ 12 దశలో ఓడిన ఎనిమిది జట్లు: సూపర్ 12 దశ నుంచి నిష్క్రమించిన ఎనిమిది జట్లకు ఒక్కొక్కరికి $70,000 డాలర్లు., రూ. 56.35 లక్షలు లభించాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే మరియు నెదర్లాండ్స్ ఆ జట్లు ఈ మొత్తం చొప్పున లభిస్తాయి. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అావార్డు లభించింది.

ఇక ఐసీసీ టీ20 కప్ లో ఎవరు ఎక్కువ పరుగులు, వికెట్లు తీశారంటే.?

-అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (296 పరుగులు)
-అత్యధిక వికెట్లు తీయడం - వనిందు హసరంగా (15 వికెట్లు)
-అత్యధిక 50-ప్లస్ స్కోర్లు - విరాట్ కోహ్లీ (4 సార్లు)
-అత్యధిక సెంచరీలు - గ్లెన్ ఫిలిప్స్, రిలీ రోసౌ (1)
-అత్యధిక సిక్సర్లు - సికందర్ రజా (11)
-అత్యధిక 4లు - సూర్యకుమార్ యాదవ్ (26)
-అత్యధిక మెయిడెన్లు - భువనేశ్వర్ కుమార్ (3)


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.