Begin typing your search above and press return to search.
టీడీపీ వెబ్ సైట్లోని ఆ కార్టూన్ల మాటేమిటి?
By: Tupaki Desk | 22 April 2017 7:30 AM GMTరెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నెటిజన్ రవికిరణ్ అరెస్టు వ్యవహారం .. సోషల్ మీడియాలో టీడీపీ - చంద్రబాబు - లోకేశ్ లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో కేసుల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు - మీడియా - సోషల్ మీడియా పాత్రపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు అండ్ కో తెలుగు మీడియాలో మేజర్ ప్లేయర్లను మేనేజ్ చేసేసి తమకు వ్యతిరేకంగా ఏమీ రాకుండా చూసుకుంటోందని.. కానీ, సోషల్ మీడియా అలా అమ్ముడు పోకపోవడంతో ఉన్నది ఉన్నట్లు నిగ్గదీస్తోందని కొన్ని వర్గాలు అంటున్నాయి. వ్యంగ చిత్రాలతో విమర్శించడమన్నది ప్రపంచవ్యాప్తంగా ఉందని.. నెహ్రూ - ఎన్టీఆర్ - రాజశేఖరరెడ్డిలపైనా ఇలాంటి వ్యంగచిత్రాలతో విమర్శలు వచ్చేవని అంటున్నారు.
అంతేకాదు.. టీడీపీ వెబ్‌సైట్‌లోనూ అలాంటి పోస్టులున్నాయని.. టీడీపీ అధికార వెబ్ సైట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ - వైసీపీ అధినేత జగన్ ను కించపరిచేలా విచ్చలవిడిగా పోస్టులున్నాయని, వాటి సంగేతంటని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించని సాక్షి మీడియా ప్రశ్నిస్తోంది. సాక్షి ప్రశ్నకు పలు వర్గాల నుంచి మద్దతు కనిపిస్తోంది.
పొలిటికల్ పంచ్ అనే వెబ్ సైట్ లో కార్టూనిస్టుగా చేస్తున్న రవికిరణ్ అరెస్టు జరగడానికి ముందు మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సోషల్ మీడియాను నియంత్రిస్తానంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన చర్యేనన్న అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు సర్కారే ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష అనుకూల మీడియా 'సాక్షి' తాజాగా ప్రభుత్వానికి ఓ ప్రశ్న సంధించింది. టీడీపీ అధికార వెబ్ సైట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ - వైసీపీ అధినేత జగన్ ను కించపరిచేలా విచ్చలవిడిగా పెట్టిన పోస్టుల సంగతేంటి? అని ప్రశ్నిస్తోంది. ఇందుకు ఎవరు బాధ్యులు.. ఎవర్ని అరెస్టు చేయాలి? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించింది. దీనికి టీడీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/