Begin typing your search above and press return to search.
కోవిడ్ నుంచి కోలుకున్నా సమస్యలు.. జ్ఞాపక శక్తి సమస్యలు
By: Tupaki Desk | 15 Aug 2021 11:30 PM GMTకొవిడ్ మహమ్మారి భారత్ సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కరోనా వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇబ్బందుల పాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి దేశాలు. ఇకపోతే ఈ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే, తాజాగా కొవిడ్ నుంచి కోలుకున్న వారిలోనూ పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనాను జయించాం అని చెప్పుకుంటున్న వారిని పరిశీలించిన తర్వాతే ఈ విషయాలు చెప్తున్నారట. అయితే, ఈ వైరస్ మనుషుల్లో ప్రధానంగా మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని, ఆ ప్రభావం ఇప్పటికీ ఉంటుందని అంటున్నారు. లండర్ ఇంపీరియల్ కాలేజ్ కొవిడ్ నుంచి కోలుకున్న 80 వేల మందిపై పరిశోధన చేసి పలు విషయాలను వెల్లడించింది. కొవిడ్ బారిన పడి ట్రీట్‌మెంట్ ద్వారా కోలుకున్న వారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల ఉందని తెలిపారు. వారికి కనీసంగా బొమ్మల పుస్తకాలను కూడా చదివి గుర్తు పెట్టుకునేంత మెమొరీ ఉండటం లేదట. డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న పలువురు కొవిడ్ వల్ల తర్వాత వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్‌కు వెళ్లగా, ఆ క్రమంలో మునుపటి స్టైల్‌లో వర్కింగ్ లేదని చెప్తున్నారు.
ఇక కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఖ్య అయితే చెప్పనక్కర్లేదు. ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్‌లో చనిపోయిన వారే అత్యధిక మంది ఉన్నట్లు తేలింది. ఇక కొవిడ్ రూపాంతరం చెందుతూ వస్తుండగా, న్యూ వేరియంట్స్ వల్ల జనాలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్ బారిని పడిన వారు కోలుకోవడం కష్టమని చెప్తున్నారు. ఈ క్రమంలోనే నార్మల్ కొవిడ్ వేరియంట్‌లా కాకుండా భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక డెల్టా వేరియంట్ బారిన పడి కోలుకున్నప్పటికీ వారిలో ఆరోగ్య సమస్యలు ఇంకా ఉంటాయని చెప్తున్నారు కొందరు. మొత్తంగా కొవిడ్ బారిన పడటం ఒక ఎత్తు అయితే, కోలుకున్నాక కూడా అలాంటి పరిస్థితులే ఉండటం పట్ల ఆందోళన చెందుతున్నారు. అయితే, సరైన పద్ధతిలో తర్వాత కూడా ట్రీట్‌మెంట్ తీసుకుంటే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఇక కొవిడ్ థర్డ్ వేవ్‌లో పిల్లలపైనే వైరస్ దాడి చేయబోతున్నట్లు తెలుస్తుండగా, వారిపైన తీవ్రప్రభావం చూపే చాన్సెస్ ఉంటాయి.
ఇక ఒకసారి థర్డ్ వేవ్‌లో కొవిడ్ బారిన పడి కోలుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అనేది తెలియాలంటే అంత వరకు ఆగాల్సిందే. అయితే, పిల్లల మానసిక సామర్థ్యం పెద్దల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇమ్యూనిటీ పవర్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలు కొవిడ్ బారిన పడితే వారి ప్రాణాలకు ముప్పు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. మన దేశంలో జనం థర్డ్ వేవ్ గురించి ప్రజెంట్ చర్చించుకుంటున్నారు. కానీ, ఫ్రాన్స్‌లో అయితే ఏకంగా ఐదో వేవ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇంకా ఆందోళన చెందుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ సోకే ప్రమాదం పొంచి ఉన్నందున జాగ్రత్తలు పాటించాల్సిందే. ప్రతీ ఒక్కరు మాస్కు మస్టుగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి.