Begin typing your search above and press return to search.
ధాన్యం రాశుల వద్ద 20 రోజులుగా వెయిటింగ్.. రైతన్న ఊపిరి ఆగింది
By: Tupaki Desk | 8 Dec 2021 5:30 AM GMTవిన్నంతనే విషాదం కమ్మేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా మార్చేశామంటూ.. అదే పనిగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిణామం మీద ఎలా స్పందిస్తారో? కేంద్రం మీద డైలీ బేసిస్ లో ప్రెస్ మీట్లు పెట్టి కడిగేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఈ విషాద ఉదంతానికి ఏమని బదులిస్తారు? అన్నది ప్రశ్న.
పడిన కష్టానికి ఫలితం ధాన్యం రాశుల లెక్కన పండటం ఒక ఎత్తు అయితే.. దాన్ని అమ్ముకునేందుకు గడిచిన 20 రోజులుగా ధాన్యం రాశుల వద్దే నిరీక్షించిన బక్క రైతు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఈ విషాద ఉదంతం తెలంగాణలో ధాన్యం పండించిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఒక నిదర్శనమని చెప్పాలి. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ వైనంవిషాదంగా మారటమే కాదు.. దీన్ని విన్న వారంతా ఇదేం రాజ్యమన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట మున్సిపాల్టీ పరిధిలోని జమ్మికుంటకు చెందిన 59 ఏళ్ల ఐలయ్య అనే రైతుకు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటానికి 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు.
పండించిన ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టారు.దీంతో.. ఐలయ్య తాను పండించిన ధాన్యాన్ని అక్కడే ఆరబోసి.. ఇరవై రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఎప్పటిలానే మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గోనె సంచుల్లోకి నింపుతుండగా.. ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. అక్కడికక్కడే ప్రాణం విడిచాడు.
ఆయనకు భార్య.. కుమార్తె ఉన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో జరిగిన ఆలస్యమే ఐలయ్య మరణానికి కారణంగా రైతుకుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులు అవుతోందని.. తేమ ఉందని.. ఆర బెట్టాలని సార్లు చెప్పిన సంది.. రోజూ ధాన్యాన్ని ఎండబెడుతున్నామని.. ఈ రోజు ఇంటికి వచ్చి.. భోజనం చేసి వచ్చాడని.. అంతలోనే ప్రాణాలు పోయినట్లుగా మరణించిన రైతు సతీమణి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇంటికి పెద్ద ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు ఏకాకిగా మారటమే కాదు.. తెలంగాణలో రైతుల కష్టాల్ని కళ్లకు గట్టేలా తాజా పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. ధాన్యాన్ని ఇలా తెస్తే.. అలా తీసేసుకుంటున్నట్లుగా ప్రభుత్వం చెబుతున్న బడాయి మాటలకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉండటం గమార్హం.