Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు విద్యార్థుల గగ్గోలు
By: Tupaki Desk | 3 Feb 2019 4:48 AM GMTఫార్మింగ్ టన్ యూనివర్సిటీ.. ఇప్పుడీ పేరు చెబితేనే అమెరికన్ విద్యార్థులు వణికిపోతున్నారు. అత్యాధునిక, అత్యుత్తమ విద్య అంటూ యూనివర్సిటీ వెబ్ సైట్ లో గొప్పలు చెప్పి విద్యార్థులను ఆకర్షించిన ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరి మోసపోయిన విద్యార్థులు ఇప్పుడు మొత్తుకుంటున్నారు. అమెరికన్ అండర్ కవర్ ఏజెంట్లు సృష్టించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో ఎక్కువగా తెలుగు విద్యార్థులే చేరి ఇప్పుడు వారి భవిష్యత్ ను అగమ్యగోచరంగా చేసుకున్నారు.
అమెరికాలోని ఈ ఫేక్ యూనివర్సిటీలో తెలియక అడ్మిషన్ పొంది వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఫీజులు కట్టిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ప్రస్తుతం ఈ తెలుగు విద్యార్థులకు నాటా, ఆటా లాంటి తెలుగు సంఘాలు సహాయం చేయడానికి ముందుకువచ్చాయి.
ఆటా ఆధ్వర్యంలో తాజాగా అటార్నీ, న్యాయనిపుణులతో వెబినార్ నిర్వహించారు. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ట్రాప్ లో చిక్కుకున్న పలువురు విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని తమ ఇబ్బందులను వివరించారు. అమెరికాలో నివాసం, ఉద్యోగం కోసం వచ్చిన వారు వెంటనే భారత దేశం వెళ్లిపోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ నోటీసులు అందజేసిన అధికారులు అమెరికా షట్ డౌన్ కారణంగా సాంకేతిక సమస్యలతో వేచి చూస్తున్నారు.
ఈ కేసు నుంచి బయటపడేందుకు తక్షణం దేశం విడిచి వెళతామని విద్యార్థులు బాండ్ తో పాటు కాన్సులేట్ లో సంప్రదించాలని తెలుగు సంఘాలు విద్యార్థులకు అటార్నీలు సూచిస్తున్నాయి. ఇందుకు రుజువుగా ఫ్లైట్ టికెట్ కూడా చూపించాలని చెబుతున్నాయి. అమెరికాలో ఆరు నెలలు అక్రమంగా ఉన్నట్టు తేలితే కనీసం ఐదేళ్లు, సంవత్సరం ఉంటే పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. మళ్లీ అమెరికాలో అడుగుపెట్టనీయకుండా బ్యాన్ విధిస్తారు.
ఇక కొందరు ఫేక్ ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు నిర్వహించాలని కోరినా విశ్వవిద్యాలయం నుంచి స్పందన రాలేదని.. తాము అడిగినా వారు సంప్రదించలేదని అది వారి తప్పేనని కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమయ్యారు. కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందడానికి సిద్ధమయ్యారు.
ఇక తెలుగు సంఘాలు నిర్వహించిన సమావేశంలో మరో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టయ్యింది. ఓ విద్యార్థి ఫార్మింగ్టన్ తరహాలోనే మిడ్ ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఇలానే ఉందంటూ నిర్వాహకులకు వివరించాడు. అక్కడి పరిస్థితులు చూసి చేరకుండా వచ్చినట్టు తెలిపాడు. ఇప్పటికే కాలేజీలో 50 మంది చేరారన్నారు. వారు ఒత్తిడి తెస్తున్నా తాను చేరడం లేదని వివరించారు. ఇలా తెలుగు విద్యార్థులు అమెరికాలో చదువు పేరుతో చేరుతున్న యూనివర్సిటీలు వారి పుట్టి ముంచుతున్నాయి.