Begin typing your search above and press return to search.

ఏపీ పోలీస్ శాఖ‌లో క‌లక‌లం..హెడ్ కానిస్టేబుల్‌ కు క‌రోనా!

By:  Tupaki Desk   |   25 April 2020 3:30 PM GMT
ఏపీ పోలీస్ శాఖ‌లో క‌లక‌లం..హెడ్ కానిస్టేబుల్‌ కు క‌రోనా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. తాజాగా కేసులు వెయ్యి మార్క్ దాటింది. దీంతో ప‌రిస్థితి ఇంకా ఆందోళ‌న‌కరంగానే ఉంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ కొత్త కొత్త విధాలుగా వ్యాపిస్తోంది. తాజాగా క‌రోనా వైర‌స్‌ తో పోలీస్ శాఖ‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఎందుకంటే ఓ హెడ్ కానిస్టేబుల్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. అయితే అత‌డికి క‌రోనా వైర‌స్ ఎలా సోకిందో అనేది మాత్రం తెలియ‌డం లేదు.

ఆ క‌రోనా బాధితుడు ‌‌‌వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వ్య‌క్తి. ఈ జిల్లాలో క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 55 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 28 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి విముక్తి పొంది డిశ్చార్జయ్యారు. అయితే పొద్దుటూరులో మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఈ జిల్లాలో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ ప‌ట్ట‌ణంలోనే క‌రోనా కేసులు 25కి చేరాయి. ఈ కేస‌ల్లోనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. దీంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా క‌ల‌క‌లం రేగింది.

ఈ సంద‌ర్భంగా వెంట‌నే హెడ్ కానిస్టేబుల్‌ తో కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్‌ కు తరలిస్తున్నారు. అత‌డు తిరిగిన ప్రాంతాలు, క‌లిసిన వ్య‌క్తుల‌ను గుర్తించి క్వారంటైన్ త‌ర‌లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే అత‌డు విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో క‌రోనా సోకి ఉంటే మాత్రం పెద్ద‌సంఖ్య‌లో అత‌డికి సంబంధించిన వ్య‌క్తుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి.

అయితే క‌డ‌ప జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉంది. కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి లాక్‌ డౌన్‌ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.