Begin typing your search above and press return to search.
శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి కన్ ఫం!?
By: Tupaki Desk | 4 Oct 2018 5:28 AM GMTతెలంగాణ ముందస్తు పుణ్యమా అని ఎవరూ ఊహించనవి జరుగుతున్నాయి. అందరూ టీడీపీ-టీఆర్ ఎస్ పొత్తును ఊహించారు. కానీ బాబు సానుభూతి పరులు కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదేమో అని అనుమానపడ్డారు. అయితే అనుకోకుండా ఆ పొత్తు పొడవలేదు. కేసీఆరే వద్దన్నారని బాబు చెబుతున్నారు గాని లోపల ఏం జరిగిందో దేవుడికే ఎరుక.
ఇక కేసీఆర్ కు వ్యతిరేకత వల్లనో - ఇక ఇక్కడ ఆప్షన్ లేకనో చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టారు. రేపో మాపో సీట్ల పంపకం కూడా తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గాలు అధికంగా ఉన్న చోట - నగర - పట్టణ ప్రాంతాల్లో బాబు ఎక్కువ సీట్లు అడుగుతున్నారట. ఎన్ని ఇస్తారో తరవాత గాని బాబుకు ఇచ్చేవి అర్బన్ లోనే ఎక్కువ ఉంటాయనడంలో సందేహమేం లేదు. అయితే, ఇంతకాలం రాజకీయాల్లో లేని ఓ పేరు ఠక్కున తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు... బాలయ్య ప్రొడ్యూసర్.. భవ్య ఆనంద్ ప్రసాద్. కొన్ని కారణాల వల్ల బాలయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారానికి అప్రకటిత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నట్టు అర్థమవుతోంది. ఖమ్మంలో టూరు మొదలెట్టడం - బాలయ్య మనుషుల పేర్ల టిక్కెట్ల జాబితాలో కనిపించడం ఇందుకు ఉదాహరణ.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ను `భవ్య క్రియేషన్స్`అధినేత - నిర్మాత ఆనంద ప్రసాద్ కు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరి టిక్కెట్లు అఫిషియల్ గా కన్ ఫం కాలేదు. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా టీడీపీయే గెలిచింది. ఈసారి పొత్తు కూడా కలిసి రావడంతో కచ్చితంగా మళ్లీ అది టీడీపీకి దక్కుతుందని అంచనాలు వేసుకున్నారేమో. మొత్తానికి సరైన సీటునే అడిగారు. తెలంగాణపై ఇప్పట్లో అధికారంలోకి ఎలాగూ టీడీపీ వచ్చేది లేదు కాబట్టి రెకమెండేషన్లు కూడా గట్టిగా పనిచేస్తున్నాయి. అందుకే బాలయ్యను కాదనడం ఎందుకులే అని భవ్య ఆనంద్ ప్రసాద్ ను అక్కడ కన్ ఫం చేసేలా ఉన్నారు.
ఈ సారి టీఆర్ ఎస్ టికెట్ పై పోటీ చేయబోతోన్న గాంధీపై ఆ సామాజిక వర్గం కొంచెం కోపంగా ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ఆనందప్రసాద్ సౌమ్యుడు కావడం ఆయనకు ప్లస్ అయ్యింది. ఆ నియోజకవర్గంలో మొవ్వ సత్యనారాయణ నుంచి ప్రసాద్ కు పోటీ ఉన్నా.... బాలయ్యతో ప్రసాద్ కు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.