Begin typing your search above and press return to search.
బాలయ్య నిర్మాతకు టికెట్ తో 'పైసా వసూల్'!
By: Tupaki Desk | 24 Oct 2018 7:33 AM GMTరాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి. ఒక దానికి మరొకటి సంబంధం లేనట్లుగా ఉంటాయి. కానీ.. తరచి చూస్తే కానీ అసలు విషయం అర్థమవుతుంది. తాజాగా అలాంటి పరిణామం ఒకటి హైదరాబాద్ రాజకీయాల్లో చోటు చేసుకోనుంది. బాలకృష్ణ చేసిన పైసా వసూల్ అనే సినిమా గుర్తుందా? ఆ సినిమా బాలయ్య ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళుతుందన్న మాట సినిమా విడుదలకు ముందు చెప్పేవారు. నిజమే.. ఆ సినిమా విడుదల తర్వాత అదెంత నిజమన్నది అందరికి అర్థమయ్యేదే.
సినిమా పేరు పైసా వసూల్ అయినా.. ఈ మూవీ ప్రొడ్యూసర్ కు మాత్రం పైసలు ఏ మాత్రం మిగల్లేదని చెబుతారు. అయితే.. మిగిలిన నిర్మాతల మాదిరి కాదు పైసా వసూల్ నిర్మాత. ఆర్థికంగా మాంచి సౌండ్ పార్టీ అయిన ఆయన ఎవరో కాదు.. భవ్య సిమెంట్స్ అధినేత..పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేసే ప్రారిశ్రామికవేత్త భవ్యాస్ ఆనందప్రసాద్.
బాలయ్యతో మూవీ తీసినందుకు పైసలు పోయినట్లుగా పలువురు అనుకున్నా.. ఆయనకు మాత్రం పైసా వసూల్ అన్న మాట వినిపిస్తోంది. అదెలా అంటే.. ఆయన శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా తన పేరును బాబు దగ్గర దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భవ్యాస్ ఆనందప్రసాద్ పేరును శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా వాట్సాప్ లో జోరుగా ప్రచారం సాగుతున్నా.. వాస్తవంలో అదెంత నిజమన్నది ప్రశ్నే.
ఎందుకంటే అదే స్థానం టికెట్ కోసం మువ్వా సత్యనారాయణ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో సినిమాలు తీయటంతో పాటు ఈనాడు బ్యాంక్‌కు ఛైర్మన్ గా వ్యవహరించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ కు వెళ్లిన ఆయన.. తాజాగా టీడీపీలో చేరారు.
స్థానికంగా పట్టు ఉన్న నేత కావటం.. పలు రకాలుగా సానుభూతి ఉన్న ఆయనకు టికెట్ ఖాయమన్న వేళలో.. భవ్యాస్ ఆనందప్రసాద్ పేరు తెరమీదకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మువ్వాకు టికెట్ ఇస్తానన్న మాట బాబు చెప్పారని.. అయితే.. ఆనందప్రసాద్ ఎంట్రీ ఇవ్వటం.. ఆయనకు బాలయ్య ఫుల్ సపోర్ట్ పలకటంతో పరిస్థితి మారినట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఆనంద ప్రసాద్ కుకానీ టికెట్ ను కన్ఫర్మ్ చేస్తే మాత్రం.. ఆయనకు ఫుల్ పైసా వసూల్ అయినట్లే. మరేం జరుగుతుందో చూడాలి.